కొత్తూరు: స్థానికులకు మరింత ఉపయోగపడే ప్రాజెక్టులు తీసుకురావాలే తప్ప చెత్త డంపింగ్‌యార్డులు కాదని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని సిద్ధాపూర్‌లో డంప్‌యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆదివారం కొడిచర్ల, ఖాజగూడతండాల్లో నిర్వహించిన ర్యాలీకి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంతర్జాతీయ విమానాశ్రాయానికి కూతవేటు దూరంలో, రాష్ట్ర రాజధానికి అతి చేరువలో ఉన్న కొత్తూరు ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని అన్నారు. రోడ్డు, రైలు, విమానమార్గాలు అనువుగా ఉండడంతో ఇప్పటికే ఇక్కడ అంతర్జాతీయస్థాయి యూనివర్సిటీలు, పాఠశాలలు, మల్టీనేషనల్ పరిశ్రమలు కొనసాగుతున్నాయని, అలాంటి చోట డంపింగ్ యార్డు సరికాదన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలువునిచ్చారు. కార్యక్రమంలో డంప్‌యార్డు వ్యతిరేక కమిటీ చైర్మన్ సత్యనారాయణ, రాంబాల్‌నాయక్, సభ్యులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్


