న్యూస్‌రీల్
బాధిత కుటుంబాలకు పరామర్శల వెల్లువ
మెరవనున్న గ్రామీణ రోడ్లు కల్వకుర్తి నియోజకవర్గంలోని గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. హ్యామ్ కింద ఆధునీకరణ చేపట్టనున్నారు.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అరగంట వ్యవధిలో ఆరు హత్యలతో అట్టుడికిన ఆ ప్రాంతం ఇప్పటికీ షాక్ నుంచి తేరుకోలేదు. కిరాతకుడి చేతిలో దారుణ హత్యకు గురైన ఆ రెండు కుటుంబాలు కంటిమీద కునుకు లేకుండా నిత్యం భయంభయంగా గడుపుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఆరు హత్యలతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన షాబాద్, దైవాలగూడ గ్రామాలు ఆదివారం కూడా నివురుగప్పిన నిప్పులా కన్పించాయి. నరమేధానికి పాల్పడిన నరరూప రాక్షసుడిని పోలీసులు ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడంతో స్థానికులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు.. ఏ రూపంలో వచ్చి.. మళ్లీ ఏం చేస్తాడోనని అంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. స్థానికంగా ఏ ఇద్దరు కలిసినా.. నిందితుడు రాజ్‌కుమార్ వ్యవహార శైలిపైనే చర్చించుకోవడం కన్పించింది. మరోవైపు రెండు గ్రామాల్లో పోలీసు పహారా కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
చిగురుటాకులా వణికిన షాబాద్, దైవాలగూడ
చర్చనీయాంశంగా ఆరు హత్యలు
ఏ ఇద్దరు కలిసినా ఇదే టాపిక్
ప్రముఖుల పరామర్శలు, నివాళులతో హడావుడి
కొనసాగుతున్న పోలీస్ పహారా
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు, మృతులకు నివాళి అర్పించేందుకు ఆదివారం పలువురు ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున గ్రామానికి తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎటు చూసినా హడావుడి కనిపించింది.


