ఓటుహక్కు పరిరక్షణే ‘సర్‌’ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఓటుహక్కు పరిరక్షణే ‘సర్‌’ లక్ష్యం

Jul 13 2026 8:09 AM | Updated on Jul 13 2026 8:09 AM

షాద్‌నగర్‌రూరల్‌: ప్రతీ అర్హుడి ఓటుహక్కును పరిరక్షించడమే సర్‌ లక్ష్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్‌ అన్నారు. మున్సిపల్‌ పరిధిలోని 6, 9, 10, 27 వార్డుల్లో కొనసాగుతున్న కార్యక్రమాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఆయా వార్డుల్లోని బూతుల్లో ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికి ఫారాలను చేరవేసే విధంగా పని చేయాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతీ ఓటరు పేరును జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటింటికీ వెళ్లి సర్‌ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కక్కునూరి వెంకటేశ్‌గుప్తా, నియోజకవర్గ ఇన్‌చార్జి అందె బాబయ్య, కౌన్సిలర్‌ ప్యాట అశోక్‌, నాయకులు శ్రీనివాసాచారి, వంశీకృష్ణ, అభినయ్‌, రవినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement