NZ vs PAK: ప్రేక్షకులు లేకుండానే క్రికెట్‌ మ్యాచ్‌ | No Fans Allowed For Warm Up Match Between Pakistan And New Zealand On Sep 29th In Uppal Stadium - Sakshi
Sakshi News home page

NZ Vs PAK Warm Up Match: ప్రేక్షకులు లేకుండానే క్రికెట్‌ మ్యాచ్‌

Sep 24 2023 3:32 AM | Updated on Sep 25 2023 1:23 PM

- - Sakshi

ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఈ నెల 29న పాకిస్తాన్‌–న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగనున్న సన్నాహక మ్యాచ్‌కు ప్రేక్షకులకు అనుమతి లేదు.

హైదరాబాద్: ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఈ నెల 29న పాకిస్తాన్‌–న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగనున్న సన్నాహక మ్యాచ్‌కు ప్రేక్షకులకు అనుమతి లేదు. ఈమేరకు రాచకొండ కమిషనర్‌ దేవేంద్ర సింగ్‌ చౌహాన్‌ బీసీసీఐ, హెచ్‌సీఏ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఇరు జట్ల క్రీడాకారులతో పాటు బీసీసీఐ/ఐసీసీ అధికారులు తప్ప సాధారణ వీక్షకులకు ప్రవేశం లేదని చెప్పారు.

క్రికెట్‌ ప్రపంచ కప్‌ పోటీలు ప్రతిష్టాత్మకమైనవి కావున క్రీడాకారులకు ఎలాంటి శాంతిభద్రత సమస్యలు లేకుండా చూడా లని పోలీసుల సిబ్బందికి సూచించారు. సమావేశంలో రిటైర్డ్‌ డీజీపీ (సీఆర్‌పీఎఫ్‌) దుర్గాప్రసాద్‌, డీసీపీ అభిషేక్‌ మహంతి, ఎస్‌ఓటీ డీసీపీ గిరిధర్‌, డీసీపీ రోడ్‌ సేఫ్టీ శ్రీబాల, ఏసీపీలు నరేష్‌ రెడ్డి, శ్రీనివాస్‌, బీసీసీఐ, హెచ్‌సీఏ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement