ఇల్లంతకుంట: కేంద్రం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు తెలిసేలా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ కోరారు. మండలంలోని చింతలకుంటపల్లెలో సోమవారం ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్ ప్రారంభోత్సవానికి హాజరై మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్‌కుమార్, గడ్డం శశిందర్రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు మారవేణి దివ్య, మామిడి హరీశ్, బత్తిని స్వామి, దేశెట్టి శ్రీనివాస్, బత్తిని సాయగౌడ్, కరికె నవీన్‌కుమార్, ముత్తవ్వ, శ్రీశైలం పాల్గొన్నారు. ప్రైవేట్ ఫంక్షన్ ప్రారంభోత్సవంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు.


