తాగు, సాగునీటిని అందించాలి | - | Sakshi
Sakshi News home page

తాగు, సాగునీటిని అందించాలి

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు యాసంగి సాగుపై అవగాహన కల్పించాలి. వాస్తవ పరిస్థితులు వివరించాలి. తాగు, సాగునీటిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇప్పటికే మిషన్‌ భగిరథ నీరు రావడం లేదు. మొన్నటి వర్షాలకు వచ్చిన మానేరు వరదనీటితో చెరువులు ముందుగా నింపితే బాగుండేది.

– చీటి సునీత, సర్పంచ్‌, గూడూరు

చివరి ఆయకట్టుకూ నీరందించాలి

యాసంగికి మానేరు నీటిని చివరి ఆయకట్టుకూ సరఫరా చేయాలి. ప్రతీ యాసంగిలో తెర్లుమద్ది రైతులకు అన్యాయం జరుగుతుంది. యాసంగికి నీరు ఇస్తారో? ఇవ్వరో? ముందుగా చెబితే ఎవరూ పంటలు వేయరు.

– పుట్ట చంద్రయ్య, రైతు, తెర్లుమద్ది

ఎల్‌నినో ఎఫెక్టు ఉంది

ఎల్‌నినో ఎఫెక్టు చాలా ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉన్న నీటి వనరులను రక్షించుకోవాలని సూచిస్తున్నారు. యాసంగికి మానేరు ప్రాజెక్టు నీరందించే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తాగునీటి అవసరాలకు, భూగర్భ జలాల పెంపుదలకు కాపాడుకోవాలని చెబుతున్నారు.

– శ్రీనివాస్‌, డీఈఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement