చక్రస్నానం.. ఏకాంత సేవ | - | Sakshi
Sakshi News home page

చక్రస్నానం.. ఏకాంత సేవ

Oct 28 2026 12:24 AM | Updated on Oct 28 2026 12:24 AM

స్వామివారికి పుష్పయాగం

పుష్పయాగం సేవలో భక్తులు

చక్ర స్నానం చేయిస్తున్న అర్చకులు

భక్తుల కొంగుబంగారం శ్రీశాల వెంకన్న బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. అశేష భక్తులు పాల్గొనగా.. రాత్రి 10గంటలకు ని ర్వహించిన శ్రీవారి ఏకాంతసేవతో ముగిశాయి. ఉదయం ఆలయంలోని శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి, భూదేవి సహితంగా వేంకటేశ్వరస్వామికి చక్రస్నానం, అంతకుముందు నిత్యహోమము, పూర్ణాహుతి, నివేదన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి నాగవల్లి, పుష్పయాగం, దేవత ఉద్వాసన, గ్రామబలి నిర్వహించారు. రాత్రి 10 గంటలకు శ్రీవారికి ఏకాంత సేవ జరిపించారు. ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు ప్రధానార్చకులు కృష్ణమాచారి, ప్రకటించారు. భక్తులు ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారి సేవలో తరించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, కౌన్సిలర్లు స్వామివారిని దర్శించుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, ఆలయ ఈవో మారుతిరావు, అర్చకస్వాములు నవీన్‌చారి, వర్దనాచారి, సుకుమారచారి, ఏఈవోలు కూనబోయిన సత్యం, పీసరి రవీందర్‌, ఆలయ కమిటీ మాజీచైర్మన్లు ఉప్పుల విఠల్‌రెడ్డి, చేపూరి నాగరాజు, వికాస తరంగిణి సభ్యులు పాల్గొన్నారు. – సిరిసిల్లటౌన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement