నాణ్యమైన వైద్యసేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన వైద్యసేవలు అందించాలి

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

● బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ● ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.30 లక్షల పరికరాలు ప్రారంభం

● బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ● ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.30 లక్షల పరికరాలు ప్రారంభం

సిరిసిల్ల: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌ సూచించారు. సీఎస్సార్‌ నిధులు రూ.30లక్షలతో జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైద్య పరికరాలను సోమవారం ప్రారంభించిన సందర్భంగా మాట్లా డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చూపుతుందని విమర్శించారు. మెడికల్‌ కాలేజీకి బస్సు సౌకర్యం కల్పించాలని కాలేజీ ప్రిన్సిపాల్‌ రాజేశ్వరీ కోరగా.. త్వరలో బస్సులను సమకూర్చుతామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఓ యువతి కాలేజీ ఫీజు చెల్లించలేకపోతున్నానని తెలపగా.. ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, సీఎస్‌ఆర్‌ఎంవోలు సుమన్‌మోహన్‌రావు, కాశీనాథ్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ చీకోటి సంతోష్‌కుమార్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ నిర్వీష పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కొమురం భీం వర్థంతి, వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ డాక్టర్లు, వైద్య సిబ్బంది కేటీఆర్‌ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందించారు. కొండూరి రవీందర్‌రావు, చలిమెడ లక్ష్మీనర్సింహరావు, తోట ఆగయ్య, తుల ఉమ, జిందం కళాచక్రపాణి, బొల్లి రామ్మోహన్‌, ఏనుగు మనోహర్‌రెడ్డి, కుంబాల మల్లారెడ్డి, కల్లూరి రాజు, మీసరగండ్ల అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement