ఏటీఎం చోరీ గ్యాంగ్‌ పట్టివేత | - | Sakshi
Sakshi News home page

ఏటీఎం చోరీ గ్యాంగ్‌ పట్టివేత

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

సూత్రధారి రశీద్‌ను రాజస్థాన్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

కరీంనగర్‌, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఏటీఎంలు కొల్లగొట్టిన ముఠా

రాజస్థాన్‌ వరకు వెంటాడిన కరీంనగర్‌, కామారెడ్డి పోలీసులు

స్కార్పియో, నకిలీ నంబర్‌ ప్లేట్లు, నగదు, మారణాయుధాలు స్వాధీనం

వారాంతంలో కరీంనగర్‌కు తరలింపు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో కలకలం రేపిన ఏటీఎం చోరీల ముఠాను ఎట్టకేలకు పో లీసులు పట్టుకున్నారు. పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ, భగత్‌నగర్‌లో దోపిడీ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఏటీఎంల చోరీ. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు పకడ్బందీగా చేపట్టి చోరీ ముఠాను పట్టుకున్నారు.

బ్లాక్‌ స్కార్పియో వెంట విచారణ

సెప్టెంబర్‌ 7న కరీంనగర్‌ పరిధిలోని తిమ్మాపూర్‌, ముగ్దుంపూర్‌ ఎస్‌బీఐ ఏటీఎంలను కొల్లగొట్టిన దుండగులు నలుపురంగు స్కార్పియో టోల్‌గేట్లను తప్పించి మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు పోలీసులు గు ర్తించారు. అంతకుముందు ఇదే ముఠా కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లోనూ చోరీలు చేసినట్లు సమాచారం అందింది. దీంతో బ్లాక్‌ స్కార్పియో కదలికలను సీసీ పుటేజీల ఆధారంగా గమనించగా మహారాష్ట్ర మీదుగా రాజస్థాన్‌ వైపు వెళ్లినట్లు గుర్తించారు. కరీంనగర్‌, కామారెడ్డి పోలీసులు రాజస్థా న్‌కు వెళ్లారు. తెలంగాణ పోలీసుల సమాచారంతో అప్రమత్తమైన రాజస్థాన్‌ పోలీసులు స్కార్పియో వాహనాన్ని అడ్డగించేందుకు ప్రయత్నించగా వారు వాహనాన్ని వదిలిపెట్టి నగదుతో పరారయ్యారు. దీంతో ఆ రాష్ట్రంలో తెలంగాణ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఫలితంగా రాజస్థాన్‌లోని బరోడా మేప్‌ సమీపంలో భరత్‌పూర్‌ వైపు పారిపోతుండగా మాటువేసిన కామారెడ్డి, కరీంనగర్‌ పోలీసులకు ఈనెల 21న ముఠా సభ్యుడు రశీద్‌ చిక్కాడు. ఈ నేపథ్యంలో కామారెడ్డి పోలీసుల వినతి మేరకు రశీద్‌ను ట్రాన్సిట్‌ వారంట్‌ మీద రా ష్ట్రానికి తరలించారు. ప్రస్తుతం కామారెడ్డి పోలీ సుల అదుపులో ఉన్నాడు. నిందితుడిని ఈ వారాంతంలో కరీంనగర్‌కు తరలించనున్నారు.

నకిలీ నంబర్‌ప్లేట్లు.. గ్యాస్‌ కట్టర్లు

ఈ దొంగతనాలలో నిందితులు ఒకే రకమైన విధానం అనుసరించారు. నలుపురంగు స్కార్పియో తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా నకిలీ నంబర్‌ ప్లేట్లు, మహిళల వస్త్రధారణ, గ్యాస్‌ కట్టర్లు, ఇంక్‌ స్ప్రే వాడిన విధానాన్ని బట్టి ఈ చోరీలన్నీ ఒకే ముఠా చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రతీ చోటా సీసీ కెమెరాలకు ఇంక్‌ స్ప్రే చేయడం, ఆక్సిజన్‌ సిలిండర్లు, గ్యాస్‌ కట్టర్లు వాడి ఏటీఎం చెస్ట్‌ని కత్తిరించడంతో రాజస్థాన్‌ ముఠా పనిగా నిర్ధారణకు వచ్చారు.

పట్టించిన నాలుగో కెమెరా

రాష్ట్రంలో హైవేలపై కాపలా లేని ఎస్‌బీఐ ఏటీఎంలనే టార్గెట్‌ చేస్తున్న ముఠా సభ్యులు కామారెడ్డిలో రహస్య సీసీ కెమెరాకు చిక్కారు. ప్రతీ ఏటీఎంకు ప్రవేశ ద్వారం, ఏటీఎం మానిటర్‌, ఏటీఎంకు కుడివైపున మొత్తం మూడు కెమెరాలు ఉంటాయని ఈ ముఠాకు ముందే తెలుసు. అందుకే పోలీసులను తప్పుదోవ పట్టించేలా ముందు మహిళగా నైటీ లేదా బురఖా ధరించి లోపలికి వస్తారు. వెంట తెచ్చుకున్న ఇంక్‌స్ప్రేను మూడు సీసీ కెమెరాలపై స్ప్రే చేస్తారు. తరువాత గ్యాస్‌కట్టర్లతో ఏటీఎంను కొల్లగొడతారు. చోరీ చేసిన ప్రతిచోటా తెలివిగా సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసిన ముఠా కామారెడ్డి ఏటీఎంలలో అమర్చిన రహస్యపు అదనపు సీసీ కెమెరాల కంటికి చిక్కారు. దీంతో నిందితుల గుట్టు వీడింది. ఈ ఫుటేజీని ఆధారంగా దర్యాపు చేసిన పోలీసులు దొంగలు రాజస్థాన్‌కు చెందిన వారిగా నిర్ధారణకొచ్చారు. ఈ ముఠా సెప్టెంబర్‌ 20న నగరంలో దాదాపు రూ.17లక్షలకు పైగా నగదు కొల్లగొట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement