సిరిసిల్ల: బాలల రక్షణ అందరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి పేర్కొన్నా రు. జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌లో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ‘సురక్షిత్ బచ్‌పన్ అభియాన్’ పేరుతో జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న పాఠశాల స్థాయి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. లక్ష్మణాచారి మాట్లాడుతూ పిల్లలకు మంచి స్పర్శ–చెడు స్పర్శ, అపరిచితులు, తెలిసిన వ్యక్తుల నుంచి ఎదురయ్యే ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. ప్రిన్సిపాల్ సుష్మిత, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, న్యాయవాదులు శ్రీనివాస్, వేణు, కళ్యాణి పాల్గొన్నారు.
కులాంతర వివాహాలకు ప్రోత్సాహకం
సిరిసిల్ల: జిల్లాలో కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రోత్సాహకాన్ని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సోమవారం పంపిణీ చేశారు. ఎస్సీ సంక్షేమశాఖ ద్వారా మంజూరైన ప్రోత్సాహక ఫిక్స్‌డ్ బాండ్లను అందించారు. 16 మంది కులాంతర వివాహం చేసుకోగా, ఒక్కో జంటకు రూ.2.50లక్షల చొప్పున అందించారు. జిల్లా ఇన్‌చార్జి ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్‌పై వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి ఎస్‌ఐఆర్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, తహసీల్దార్లు జయంత్‌కుమార్, ఎన్ని కల విభాగం అధికారి రెహమాన్ పాల్గొన్నారు.
వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శం
సిరిసిల్ల: ఆదికవి వాల్మీకి మహర్షి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో సోమవారం వాల్మీకి జయంతి నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ ఒక సామాన్య బోయవాణిగా జీవితం గడిపిన వాల్మీకి అనంతరకాలంలో రామాయణాన్ని రచించడం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. కృషి, నిబద్ధత ఉంటే మనుషులు రుషులవుతారు అనే దానికి వాల్మీకి నిదర్శనమన్నారు. ఎస్బీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ మధుకర్, రమేశ్, సీఐ రవికుమార్ పాల్గొన్నారు.
గ్రీవెన్స్ డేకు 21 ఫిర్యాదులు
జిల్లా ఎస్పీ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన గ్రీ వెన్స్ డేకు 21 మంది బాధితులు వచ్చి ఎస్పీ మహే శ్ బీ గీతేకు ఫిర్యాదులు అందించారు. ఆయా పోలీ స్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలకు ఎస్పీ నేరుగా ఫోన్‌లో మా ట్లాడి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
ఎల్లారెడ్డిపేట: గ్రామాల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. మండలంలోని పదిర శివారులోని రేణుక–ఎల్లమ్మ ఆల యం వద్ద షెడ్డు నిర్మాణానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ రూ.5 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో నిర్మించే షెడ్డుకు సోమవారం శంకుస్థాపన చే శారు. సర్పంచ్ బోనాల మణెమ్మ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, మండలాధ్యక్షుడు రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
బోయినపల్లి: ఎస్జీఎఫ్ అండర్–14 రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు మండలంలోని నర్సింగాపూర్ హైస్కూల్ విద్యార్థులు ఎన్.ఆదిత్య, ఆర్.అవంతిక, విలాసాగర్ హైస్కూల్‌కు చెందిన వి.నవీన్, ఎం.హర్శిత్, ఓ.అక్షిత ఎంపికై నట్లు ఎంఈవో శ్రవణ్‌కుమార్ సోమవారం తెలిపారు. కేశవపట్నంలో నిర్వహించిన పోటీల్లో జిల్లా రెండో స్థానం పొందినట్లు తెలిపారు. విద్యార్థులను పీడీ పంతం ప్రభాకర్, పీఈటీ మధుకర్‌రెడ్డి అభినందించారు.


