కుటుంబ నేపథ్యం.. హాబీలు
సిరిసిల్ల: పట్టుదలకు కృషి తోడైతే ఏదైనా సాధించవచ్చని ఐఏఎస్ అధికారి శ్యాంప్రసాద్‌లాల్ ప్రస్థానం సాక్ష్యం. సాధారణ మధ్యతరగతి పద్మశాలి కుటుంబంలో పుట్టి.. సర్కారు బడిలో అక్షరాలు దిద్దిన విద్యార్థి.. నేడు ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు. దేశంలోనే అత్యున్నతమైన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్(ఐఏఎస్)కు ఎంపికవడం ఎంతో మంది కల. ఆ కలను కొంతమంది సాధిస్తారు. ఈ కోవాలోకి వస్తారు జి.వి.శ్యాంప్రసాద్‌లాల్. రెవెన్యూశాఖలో డిప్యూటీ తహసీల్దార్(డీటీ)గా ఉద్యోగంలో చేరి.. అంచెలంచెలుగా ఎదిగి ఐఏఎస్ సాధించిన గాజుల వెంకట శ్యాంప్రసాద్‌లాల్ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
1995లో డిప్యూటీ తహసీల్దార్‌గా..
1995లో డిప్యూటీ తహసీల్దార్(డీటీ)గా గ్రూప్–2లో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్‌గా 1995 జూలై 31న విధుల్లో చేరారు. 1996 ఆగస్ట్ 1న గంభీరావుపేటలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధుల్లో చేరి 1998 డిసెంబరు వరకు పనిచేశారు. తహసీల్దార్‌గా పదోన్నతి పొంది 1998లో బోయినపల్లి, 2003లో సిరిసిల్ల, 2004లో పెద్దపల్లి, 2005లో హుజూరాబాద్, 2006లో కరీంనగర్, 2008లో కాటారం, కోరుట్ల తహసీల్దార్‌గా పనిచేశారు. 2009లో కొద్ది నెలలపాటు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల తహసీల్దార్‌గా, ఆ తరువాత 2010లో కోరుట్ల తహసీల్దార్‌గా పనిచేశారు. 2011 మార్చిలో డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. వరంగల్‌లో భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా, 2013లో రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేశారు. 2014లో వరంగల్‌లో ఆర్‌వీఎం ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేశారు. 2014లోనే నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డీవోగా, 2016లో సిరిసిల్ల ఆర్డీవోగా పనిచేశారు. 2017లో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొంది జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్‌వో)గా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేశారు. 2019లో అదనపు కలెక్టర్‌గా పదోన్నతి పొంది కరీంనగర్‌లో పనిచేశారు. 2023లో పెద్దపల్లి అదనపు కలెక్టర్‌గా పనిచేశారు. 2024లో మహాత్మా జ్యోతిభాపూలే విద్యాసంస్థ జాయింట్ సెక్రటరీగా పనిచేసిన శ్యాంప్రసాద్ లాల్ 2026 జనవరిలో ఐఏఎస్‌గా కన్ఫార్మ్ అయి.. నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్‌గా విధుల్లో చేరారు. ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా చేరి విధులు నిర్వహిస్తున్నారు.
తల్లిదండ్రులు: సత్యవతి (బీడీ కార్మికురాలు), గాజుల రాజేశం(రజనిశ్రీ) ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రముఖ రంగస్థల నటుడు, నాట్యాచార్యుడు.
భార్య, పిల్లలు: మాధవి కుమారి, మేఘాంశ్ ప్రసాద్, ప్రీతమ్ ప్రసాద్
పెళ్లి: 1995 మే 3న (సిరిసిల్ల అత్తగారి ఊరు)
పేరులో ప్రత్యేకతలు: గాజుల వెంకట శ్యాంప్రసాద్‌లాల్(తాత వెంకటయ్య పేరు కలిసి వచ్చేలా వెంకట, నవంబరు 14న జన్మించిన నేపథ్యంలో జవహర్‘లాల్’ను పేరు చివర వాళ్ల నాన్న రజనిశ్రీ పెట్టడం విశేషం)
హాబీలు: సాహిత్యం చదవడం, షటిల్ ఆడడం, పాటలు వినడం.
జర్నలిస్ట్‌గా: ‘వాన కురిసింది.. పుడమి మురిసింది’ అంటూ.. ఉత్తమ శీర్షికలు ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు.
డిప్యూటీ తహసీల్దార్ నుంచి ఐఏఎస్ వరకు..
అంచెలంచెలుగా ఎదిగిన హుస్నాబాద్ కుర్రాడు
యువతకు స్ఫూర్తి
జి.వి.శ్యాంప్రసాద్‌లాల్ ప్రస్థానం
హుస్నాబాద్
టు హైదరాబాద్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో 1969 నవంబరు 14న జన్మించారు. హుస్నాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం, 1984లో పదో తరగతి, 1986లో ఇంటర్ పూర్తి చేశారు. 1989లో సిద్దిపేటలో బీఎస్సీ, 1991లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ(తెలుగు) పూర్తి చేశారు. 1992లో జర్నలిజం చేసిన ఆయన 1992లో ఓ దినపత్రిలో సబ్ ఎడిటర్‌గా చేరారు.


