వేములవాడ: తొలి ఏకాదశి శనివారం నాడు భీమన్న ఆలయం ఎదుట నాగుపాము కలకలం రేపింది. స్నేక్ క్యాచర్ జగదీశ్ పట్టుకొని అటవీప్రాంతంలో వదిలేశారు. భీమన్న ఆలయం ఎదుట తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొన్న వేళ నాగుపాము ప్రత్యక్షమైంది. పామును గమనించిన భక్తులు భయాందోళనకు గురికాగా.. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ జగదీశ్ వెంటనే అక్కడికి చేరుకొని చాకచక్యంగా పట్టుకున్నారు. జగదీశ్ సమయస్ఫూర్తితో స్పందించడంతో ఆలయానికి వచ్చిన భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. పాములు కనిపిస్తే చంపకుండా వెంటనే అటవీశాఖ, శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించాలని కోరారు.
చిన్నారిని బలిగొన్న కేన్సర్
జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలం పోచంపేట గ్రామానికి చెందిన మోటూరి తేజాన్ష్ (7) కేన్సర్‌తో బాధపడుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. గ్రామానికి చెందిన మాటూరి మహేశ్, రాధ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు తేజాన్ష్. మహేశ్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం తేజాన్ష్ అనారోగ్యం బారినపడడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చూపించారు. వారు కేన్సర్‌గా గుర్తించారు. తేజాన్స్‌కు నాలుగు నెలలుగా హైదరాబాద్‌లో చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి విషమించి మృతిచెందాడు. శనివారం స్వగ్రామంలో బాలుడికి అంత్యక్రియలు నిర్వహించారు.
వెయిటర్, హెవీ డ్రైవర్ పోస్టులు
ఈనెల 28న ఇంటర్వ్యూలు
వేములవాడ: యూఏఈలోని ప్రముఖ ‘జీటీఎం కేటరింగ్’ సంస్థలో వెయిటర్లు, హెవీ డ్రైవర్ల ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జీటీఎం ఇంటర్నేషనల్ రిక్రూట్‌మెంట్ సంస్థ ప్రతినిధి చీటి సతీశ్‌రావు శనివారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 28వ తేదీ ఉదయం 10 గంటలకు జీటీఎం ఇంటర్నేషనల్‌కు చెందిన అన్ని శాఖల కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు.
ఉద్యోగాలు: వెయిటర్లు, హెవీ డ్రైవర్లు(చెల్లుబాటు అయ్యే యూఏఈ లైసెన్స్ తప్పనిసరి). వయోపరిమితి 21 నుంచి 40 ఏళ్లు.
వేతనం : వెయిటర్లకు నెలకు ఏఈడీ 1,200(సుమారు రూ.32వేలు), హెవీ డ్రైవర్లకు ఏఈడీ 3,500(సుమారు రూ.93వేలు).
ఇతర సౌకర్యాలు: ఉచిత భోజనం, వసతి, రవాణాతోపాటు ఉచిత వీసా, ఫ్లైట్ టికెట్(100 శాతం ఉచిత నియామకం, ఎలాంటి సర్వీస్ చార్జీలు ఉండవు) అందిస్తారు.
అర్హతలు–నిబంధనలు : ఆంగ్లంలో మాట్లాడటం, వెయిటర్‌గా అనుభవం ఉన్నవారు అర్హులు. శరీరంలో బయటకు కనిపించే టాటూలు ఉండకూడదు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ పాస్‌పోర్ట్, అప్‌డేటెడ్ సీవీలతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని చీటి సతీష్‌రావు కోరారు. మరిన్ని వివరాలకు.. సికింద్రాబాద్‌లో 8332052299, నిజామాబాద్‌లో 8686860999, ఆర్మూర్‌లో 8332062299, జగిత్యాలలో 8332042299, సిరిసిల్లలో 9391661522 నంబర్లలో సంప్రదించాలని కోరారు.


