ముస్తాబాద్(సిరిసిల్ల): రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్‌స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచుతున్నామని డీఈఈ అంజయ్య తెలిపారు. ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది సబ్‌స్టేషన్‌లో 5 ఎంవీఏ పీటీఆర్‌ను శనివారం డీఈఈ ప్రారంభించి మాట్లాడారు. ముస్తాబాద్ మండలంలో ఉన్న సబ్‌స్టేషన్లలో అదనపు ఎంవీఏ పీటీఆర్‌లను బిగిస్తున్నామన్నారు. గృహ, వ్యవసాయ విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయవచ్చని పేర్కొన్నారు. ఆటంకం లేని కరెంట్ సరఫరా చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఏఈ విష్ణుతేజ పాల్గొన్నారు.


