సిరిసిల్లటౌన్: రంగుల కేళీ హోలీ పండుగ సంబరాలు మంగళవారం జిల్లా వ్యాప్తంగా జరిగాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో ప్రజలు రంగుల పండుగను ఉత్సాహంతో జరుపుకున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా డీజే, సౌండ్ సిస్టమ్‌తో ఆడుతూ పాడుతూ రంగులు చల్లుకున్నారు. ఎస్పీ మహేశ్ బి గితే సిబ్బందితో ఆటపాటలతో అలరించారు. చైర్‌పర్సన్ జిందం కళ మున్సిపల్ ఆఫీసు ప్రాంగణంలో కౌన్సిలర్లు, సిబ్బందితో వేడుకలు నిర్వహించారు. అధికారులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
సంబరాల్లో కౌన్సిలర్ చంద్రకళ, మహిళలు


