రాగితీగ చోరీ నిందితులను పట్టుకున్న ప్రజలు | - | Sakshi
Sakshi News home page

రాగితీగ చోరీ నిందితులను పట్టుకున్న ప్రజలు

Sep 13 2026 9:04 AM | Updated on Sep 13 2026 9:04 AM

రాగితీగ చోరీ నిందితులను పట్టుకున్న ప్రజలు

పెద్దారవీడు: మండలంలోని తోకపల్లి సమీపం తీగలేరు కాలువ వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌లో రాగి తీగను మంటల్లో కాల్చుతున్న వారిని గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గ్రామం సమీపంలో మంటలు కనిపించడంతో ప్రజలు అప్రమమత్తమయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరు దొంగలు రాగి తీగలను కాలుస్తూ కనిపించడంతో వారిని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారి వద్ద ఉన్న ద్విచక్ర వాహనంతో పాటు రాగి తీగలను స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో నిందితులు తిమ్మాపురం గ్రామానికి చెందిన ఆంజనేయులు, శ్రీనుగా తేలింది. రైతుల పొలాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను పగులకొట్టి అందులో ఉన్న రాగి తీగలు తీసుకొచ్చినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement