మార్కాపురం టౌన్: ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ పరీక్ష నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తూ ఏపీటీఎఫ్–1938 ఆధ్వర్యంలో బుధవారం మార్కాపురం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఎం.విజయసునీతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రాచేటి సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23(1)ను సవరించి ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఒకవేళ ప్రత్యేక టెట్ నిర్వహిస్తే అందరికీ 40 శాతం ఉత్తీర్ణత మార్కులుగా నిర్ణయించాలని, బోధించే సబ్జెక్టులకే ప్రాధాన్యమిస్తూ ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబర్‌లో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మంద బాలరాజు, ఎస్‌సీ కుమార్, యు.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ
ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మార్కాపురం పట్టణంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. టెట్ పేరుతో ఉపాధ్యాయులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు వీరారెడ్డి, శ్రీరాములు, శ్రీనివాసులు, రవికుమార్ పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన
మార్కాపురంలో యూటీఎఫ్ భారీ ర్యాలీ


