వైఎస్సార్‌ సీపీలో పలువురు నాయకులకు పదవులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో పలువురు నాయకులకు పదవులు

Jul 31 2026 2:50 AM | Updated on Jul 31 2026 2:50 AM

వైఎస్సార్‌ సీపీలో పలువురు నాయకులకు పదవులు

మార్కాపురం: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, కనిగిరి, సంతనూతలపాడు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైఎస్సార్‌ సీపీ నాయకులకు పార్టీ పదవులు కేటాయిస్తూ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. మార్కాపురం పట్టణానికి చెందిన టి.సత్యనారాయణను రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్‌ సెక్రటరీగా, కొండ్రగుంట సుబ్బారావును స్టేట్‌ ఇంటలెక్చువల్‌ ఫోరం జనరల్‌ సెక్రటరీగా, మొఘల్‌ సిరాజ్‌తుల్లాబేగ్‌ను రాష్ట్ర మున్సిపల్‌ వింగ్‌ జనరల్‌ సెక్రటరీగా, నాలి కొండయ్య యాదవ్‌ను రాష్ట్ర మున్సిపల్‌ వింగ్‌ కార్యదర్శిగా నియమించారు. రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా గొలమారి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఎస్‌ఈ సెల్‌ కార్యదర్శిగా అక్కిదాసరి ఏడుకొండలు, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా సూరెడ్డి భూలక్ష్మి, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శిగా ఎం.మురళీకృష్ణను నియమించారు. అదేవిధంగా కనిగిరికి చెందిన కాకర్ల వెంకటేశ్వర్లు పార్టీ రజక విభాగం కనిగిరి నియోజకవర్గ అధ్యక్షునిగా నియమితులవగా, సంతనూతలపాడుకు చెందిన బి.రామాంజనేయులు రాష్ట్ర పబ్లిసిటీ వింగ్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement