కొత్తపట్నం: ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. మండలంలో అధికారిక ఇసుక క్వారీ లేకపోయినా ఇసుకను జోరుగా తవ్వి తరలిస్తున్నారు. ఈ అక్రమ దందా అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లుగా వ్యహరిస్తున్నారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఒక వేళ లోడుతో పట్టుకుంటే వారికి ఇష్టమొచ్చిన వారిని వదిలిపెడుతున్నారు. మండలంలో మోటుమాల, కొత్తపట్నం, గమళ్లపాలెం, వజ్జిరెడ్డిపాలెం, రాజుపాలెం, మడనూరు గ్రామాల్లో ఇసుక రవాణా కొనసాగుతోంది. రోజుకు వందల ట్రాక్టర్లు తవ్వేస్తున్నారు. మోటుమాల గ్రామంలో కస్తూబా గాంధీ వనరుల కేంద్రం పక్కనే ఇసుక తవ్వి తరలిస్తున్నారు. పక్కనే ఉన్న ప్రహరీ అంచునే ఇసుక తీస్తున్నారు. దీంతో ప్రహరీ పడిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.


