OÐðlsŒæ M>ÓÆŠḥtæjË*sîæ | - | Sakshi
Sakshi News home page

OÐðlsŒæ M>ÓÆŠḥtæjË*sîæ

Jul 20 2026 7:35 AM | Updated on Jul 20 2026 7:35 AM

తెల్ల రాయిపై పచ్చ గద్దలు

తెల్ల రాయిపై పచ్చ గద్దలు

పీసీపల్లి:

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పచ్చ నేతల కన్ను సహజ సంపదపై పడింది. కనిగిరి నియోజకవర్గంలో ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వైట్‌ క్వార్ట్జ్‌ (తెల్ల రాయి) నిక్షేపాలను అధికార టీడీపీ నేతలు బకాసురుల్లా దిగమింగుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అటవీ, రెవెన్యూ, బంజరు భూముల్లో నిబంధనలకు పాతరేసి, ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతూ కోట్లు గడిస్తున్నారు. ’అధికారం మాదే.. అడిగేదెవరు?’ అన్న చందంగా పచ్చ గద్దలు రెచ్చిపోతుంటే, వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతూ చోద్యం చూస్తున్నారు.

కనిగిరి ప్రాంతంలో లభించే గ్రేడ్‌1 తెల్ల రాయికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఇక్కడ టన్ను రాయి రూ.7 వేల నుంచి రూ. 8 వేల వరకు పలుకుతుండగా, విదేశాలకు ఎగుమతి చేస్తే అది ఏకంగా రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ధర పలుకుతోంది. ఈ భారీ లాభాలపై కన్నేసిన టీడీపీ నేతలు సిండికేట్‌గా ఏర్పడ్డారు. నెల్లూరు, గుంటూరు, విజయవాడ, గూడూరు, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు చెందిన అక్రమార్కులు కనిగిరిలో వాలిపోయారు. ఈ సిండికేట్‌ శాసనమే ఇక్కడ వేదంగా మారింది. స్థానికంగా ఎవరు తెల్ల రాయి తరలించాలన్నా టన్నుకు రూ.1500 చొప్పున సిండికేట్‌కు ‘కప్పం’ కట్టాల్సిందే. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని గూడూరుకు చెందిన ఓ వ్యక్తి ద్వారా జిల్లా స్థాయి అధికారులకు, రాజకీయ నేతలకు వాటాల రూపంలో చేరవేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు, మారిటైం బోర్డులో ముఖ్య పాత్ర పోషిస్తున్న నాయకుడే ఈ తతంగాన్నంతా నడిపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘దమ్ముంటే పట్టుకోండి.. పట్టుకున్నా విడిపించుకునే సత్తా మా సిండికేట్‌కు ఉంది’ అంటూ ఈ తెల్ల రాయి కేటుగాళ్లు బహిరంగంగానే సవాళ్లు విసురుతున్నారు.

ప్రభుత్వ ఖజానాకు రాయల్టీ రూపంలో చేరాల్సిన కోట్ల రూపాయల ఆదాయం పచ్చ నేతల జేబుల్లోకి వెళుతోంది. ఈ అక్రమ దందాకు మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పరోక్షంగా సహకారం అందిస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ’తలా పాపం తిలా పిడికెడు’ అన్నట్లుగా అన్ని శాఖల అధికారులకు నెలవారీ మామూళ్లు ముడుతుండటంతో వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. స్థానిక ప్రజలు, రైతులు అక్రమ తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే, ఆ సమాచారాన్ని ముందుగానే మాఫియాకు చేరవేస్తున్నారు. తీరా నామమాత్రంగా తనిఖీలకు వెళ్లి, ఎందుకూ పనికిరాని రాయిని సీజ్‌ చేసినట్లు నాటకాలు ఆడుతూ పత్రికలకు ఫోజులిస్తున్నారు. అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది.

కనిగిరి నియోజకవర్గం ఇప్పుడు అక్రమ మైనింగ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. కనిగిరి మండలంలోని చీరల దిన్నె, గురువాజీపేట, ఎర్ర ఓబనపల్లె, మాల కొండాపురం, సీఎస్‌ పురం మండలంలోని రెడ్డిగారి కొత్తపల్లి, హరి వేముల, వెలిగండ్ల మండలంలోని పద్మాపురం, మొగిలిచర్ల, కట్ట కింద పల్లి.. అలాగే హనుమంతునిపాడు, పామూరు, పీసీ పల్లి తదితర మండలాల్లోని పదుల సంఖ్యలో గ్రామాల్లో రాత్రికి రాత్రే భారీ జేసీబీలతో కొండలను సైతం పిండి చేస్తున్నారు. మినరల్స్‌ పేరుతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన యార్డుల్లో ఈ ఖనిజాన్ని నిల్వ చేసి, కూలీలతో పగలగొట్టించి గ్రేడింగ్‌ చేస్తున్నారు. గోనె సంచుల్లో ప్యాక్‌ చేసి, ఒక్కో లారీలో 30 నుంచి 40 టన్నుల సరుకును ఎక్కించి, రాత్రికి రాత్రే లారీల్లో విశాఖపట్నానికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి సముద్ర మార్గంలో చైనా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

కొండలు సైతం పిండి..

మాఫియా మంత్రాంగం.. మౌనంగా అధికార యంత్రాంగం

పచ్చ సిండికేట్‌కు కప్పం కట్టాల్సిందే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement