కాపుల అభ్యున్నతికి పాటుపడిన ముద్రగడ | - | Sakshi
Sakshi News home page

కాపుల అభ్యున్నతికి పాటుపడిన ముద్రగడ

Jul 20 2026 7:35 AM | Updated on Jul 20 2026 7:35 AM

కాపుల అభ్యున్నతికి పాటుపడిన ముద్రగడ

ఒంగోలు వన్‌టౌన్‌: కాపుల కోసం తన రాజకీయ జీవితాన్ని తృణప్రాయంగా వదిలేసి, కాపుల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని కాపు నేతలు కొనియాడారు. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు రామ్‌నగర్‌లోని జిల్లా కాపు సంఘ కార్యాలయంలో ఆదివారం ముద్రగడ పద్మనాభం సంతాప సభ నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కాపు సంఘ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ కుమార్‌ మాట్లాడుతూ ముద్రగడ ఎంఎల్‌ఎగా, మంత్రిగా, ఎంపీగా పనిచేశారని..నీతి, నిజాయతీ అంటే ముద్రగడేనన్నారు. చిన్న మాట కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశారన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం, కాపుల ఐక్యత కోసం ముద్రగడ ఉద్యమం చేస్తేనే కాపు కార్పొరేషన్‌ ఏర్పాటైందన్నారు. ఈ కార్పొరేషన్‌ల ద్వారానే పేద కాపులు రుణాలు పొందారని చెప్పారు. కాపుల రిజర్వేషన్ల కోసం ఏన్నో రకాలుగా ప్రయత్నించారన్నారు. కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు ఐ ఘనశ్యామ్‌, టి రామస్వామి, వెంకటేశ్వర్లు, మంత్రి శ్రీనివాసరావు, ఎస్‌ సాయిబాబా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement