28న విద్యార్థి, యువజన ర్యాలీని
● వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యడు పల్నాటి రవీంద్రారెడ్డి
ఒంగోలు సిటీ: ఈ నెల 28వ తేదీ మంగళవారం ఒంగోలులో విద్యార్థి–యువజన ర్యాలీని జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు ర్యాలీకి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్నాటి రవీంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలులో వైఫల్యం, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిరుద్యోగభృతి అమలు చేయకపోవడం, నీట్ పరీక్షల్లో అవకతవకలు వంటి విధానాలపై ఈ నెల 28వ తేదీ విద్యార్థి, యువజన విభాగంలో ఆధ్వర్యంలో ఒంగోలులో జరిగే ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంతో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కేవలం అక్రమ కేసులతో ఇబ్బందులు పెడుతూ భయ భ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో టౌన్ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ వెంకు, యూత్ ప్రెసిడెంట్ సన్నీ, చందు, ప్రసన్న, సిద్ధ, గోవర్ధన్, చెంచురెడ్డి, మహేంద్ర, తదితరులు పాల్గొన్నారు.


