న్యూస్‌రీల్
చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. మంత్రి ఇలాకాలో మద్యం పరవళ్లు తొక్కుతోంది. లైసెన్స్ మద్యం దుకాణాలకు నాలుగు రెట్లు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. అద్దంకి ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో పదికి పైగా మద్యం తాగే ధాబాలు, అనధికారిక రెస్టారెంట్‌లు నడుస్తున్నాయి. వీటిలో కొన్నింటికి ప్రత్యక్షంగా, మరి కొన్నింటికి పరోక్షంగా పలువురు పచ్చనేతల భాగస్వామ్యం, మద్దతు ఉన్నాయి. వీటన్నింటికీ అంతిమంగా అమాత్యుని అండ ఉందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
సోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026
బెల్ట్ షాపులు, అనధికారిక మద్యం సిట్టింగులు బహిరంగ రహస్యాలు. కొన్ని చోట్ల సమయ పాలన కూడా లేదు. అయితే ఇవి సంబంధిత ఎకై ్సజ్ శాఖ అధికారులకు కనిపించటం లేదని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. అధికార పార్టీ అండతోనే ఇదంతా జరుగుతోందని, తాము అడ్డుకున్నా ఆగదని సంబంధిత అధికారులు స్వామి కార్యం, స్వకార్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల ఎన్‌డీపీ (నాన్ డ్యూటీ పెయిడ్) లిక్కర్ కూడా నడుస్తోంది.


