ఓవరాల్ చాంపియన్ ఒంగోలు
ఒంగోలు: పాలిటెక్నిక్ కాలేజీల అంతర్‌జిల్లాల పోటీల్లో ఒంగోలు డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. స్థానిక డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మంగళవారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంకేతిక విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు ఎ.నిర్మల్‌కుమార్ ప్రియ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. త్వరలో తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా రాణించి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న సాంకేతిక విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి డీఎస్‌వీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఒంగోలులో నిర్వహించిన పోటీలు ఆకట్టుకున్నాయని నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో ఒంగోలు డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ నర్రా శ్రీనివాసరావు, ఇతర పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొని విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
విజేతల వివరాలు వరుసగా
జావెలిన్ త్రో: ఎస్‌కే అభిలాష్ (ఒంగోలు డీఏ ప్రభుత్వ), యు.ఉపేంద్ర (కంభం ఎస్‌వీకేపీ), ఈ.నాగేంద్రబాబు (ఒంగోలు డీఏ ప్రభుత్వ)
లాంగ్‌జంప్: ఎం.జస్వంత్‌నాయక్(కంభం ఎస్‌వీకేపీ), టి.గోపి(ఒంగోలు డీఏ ప్రభుత్వ), వి.పవన్‌కుమార్ (కంభం ఎస్‌వీకేపీ)
హైజంప్: ఎం.జస్వంత్‌నాయక్ (కంభం ఎస్‌వీకేపీ), పి.అమన్(ఒంగోలు డీఏ ప్రభుత్వ), పి.అశోక్ (కందుకూరు ప్రభుత్వ)
ట్రిపుల్ జంప్: టి.గోపి(ఒంగోలు డీఏ ప్రభుత్వ), వి.పవన్‌కుమార్( కంభం ఎస్‌వీకేపీ), ఎస్‌కె షఫి (కందుకూరు ప్రభుత్వ)
ఆటల పోటీలు:
బ్యాడ్మింటన్ సింగిల్స్: ఎం.సూర్యకిరణ్ (సెయింట్ ఆన్స్ చీరాల), సీహెచ్ రఘు (ఒంగోలు పేస్ ), డి.అభినవ్ (ఒంగోలు డీఏ ప్రభుత్వ)
బ్యాడ్మింటన్ డబుల్స్: ఎం. సూర్యకిరన్, టి.మనోజ్ (సెయింట్ ఆన్స్ చీరాల) , సీహెచ్ రఘు, ఎస్‌కే ఆసిఫ్ (పేస్), పి.విజయ్‌కుమార్, కె.జస్వంత్ (కందుకూరు ప్రకాశం పాలిటెక్నిక్)
టేబుల్ టెన్నిస్ సింగిల్స్: ఆర్.యశ్వంత్ (రైజ్ పాలిటెక్నిక్), ఎ.వపన్ (కందుకూరు ప్రకాశం పాలిటెక్నిక్), టి.సాత్విక్ (పేస్)
టేబుల్ టెన్నిస్ డబుల్స్: ఆర్.యశ్వంత్, ఎస్‌కె షాహెజాద్ (రైజ్), ఎస్.పూజిత్, ఎ.పవన్ (కందుకూరు ప్రకాశం), కె. సుధీర్, జి.ఉమాశంకర్ (ఒంగోలు డీఏ ప్రభుత్వ)
చదరంగం: టి.మనోజ్(చీరాల సెయింట్ ఆన్స్), ఎస్‌కే ఇస్మాయిల్( రైజ్), ఈ.హర్షవర్థన్ ( కంభం ఎస్‌వీకేపీ)
బాల్ బ్యాడ్మింటన్: పేస్ కాలేజీ, కందుకూరు ప్రకాశం పాలిటెక్నిక్, ఒంగోలు డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్
వాలీబాల్: చీరాల సెయింట్ ఆన్స్, ఒంగోలు డీఏ ప్రభుత్వ, కందుకూరు ప్రకాశం పాలిటెక్నిక్
కబడ్డీ: చీరాల సెయింట్ ఆన్స్ పాలిటెక్నిక్, ఒంగోలు డీఏ ప్రభుత్వ, పేస్ పాలిటెక్నిక్ కాలేజి
ముగిసిన పాలిటెక్నిక్ కాలేజీల
అంతర్‌జిల్లాల పోటీలు
కంభం పాలిటెక్నిక్ కాలేజీకి వ్యక్తిగత
చాంపియన్‌షిప్
ఓవరాల్ చాంపియన్ ఒంగోలు
ఓవరాల్ చాంపియన్ ఒంగోలు


