మార్కాపురం ఇన్‌చార్జి కలెక్టర్, ఎస్పీల నియమాకం
ఒంగోలు ప్రతినిధి: కొత్తగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాకు ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబును ఇన్‌చార్జిగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఇన్‌చార్జి ఎస్పీగా ప్రకాశం ఎస్పీ హర్షవర్థన్ రాజును నియమించింది.
అర్ధరాత్రి వరకు
మందేసి చిందేయొచ్చు
ఒంగోలు టౌన్: మందు బాబులకు రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి వరకు తాగి తందనాలాడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన సంవత్సర వేడుకలను మరింత నిషాగా నిర్వహించుకునేందుకు రైట్ రైట్ చెప్పింది. ఒకవైపు మహిళా సంఘాలు నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయాలపై నియంత్రణ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితేనేం అంటూ చంద్రబాబు ప్రభుత్వం మరింత ఎక్కువగా తాగేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ షేక్ ఆయేషా బేగం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో బుధవారం అర్ధరాత్రి, జనవరి 1వ తేదీ అర్ధరాత్రి వరకు మద్యం విక్రయ సమయాలను పొడిగించినట్లు తెలిపారు. మద్యం దుకాణాలకు రాత్రి 12 గంటల వరకు సమయం పొడిగించామన్నారు. బార్లు, ఈవెంట్ పర్మిట్లు, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లైసెన్సులు కలిగిన వారికి అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. నూతన సంవత్సరం వేడుకల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం, నాటుసారా, కల్తీ మద్యం విక్రయాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయాల సమయం పొడిగించడంతో ఇక మందుబాబులకు అడ్డుఅదుపూ లేకుండా పోతుందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏదైనా జరగరాని ఘటనలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
● జిల్లాలోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో అత్యధికంగా రెవెన్యూ సమస్యలపై అర్జీలు వస్తున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో అధికారులు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అంశాలు, కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, రేషన్ షాపుల తనిఖీలు, దీపం 2 పథకం అమలు, ధాన్యం సేకరణ, రెవెన్యూ రాబడి, నీటి ఆడిటింగ్, నీటి బడ్జెట్, భూగర్భ జలాల వాస్తవ తనిఖీ, నీటి వనరుల విశ్లేషణ, కేంద్ర ప్రాయోజిత పథకాల పనుల పురోగతి, గృహ నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై సమీక్షించి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ సమస్యలపై అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులు పరిశీలించినప్పుడే సంబంధిత సమస్య నాణ్యతతో పరిష్కరించేలా వీలవుతుందన్నారు. గ్యాస్ పంపిణీ, రేషన్ పంపిణీలలో వినియోగదారులతో ఐవీఆర్‌ఎస్ ద్వారా వచ్చే వారి అభిప్రాయాలు తీసుకుంటామని, ఏ వినియోగదారుడైనా వంట గ్యాస్ అందించే డెలివరీ, రేషన్ సరుకులు అంశాలలో ఫిర్యాదు చేస్తే సంబంధిత వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. రిజిస్ట్రేషన్, ఎకై ్సజ్, మైనింగ్, కమర్షియల్ టాక్స్ శాఖల అధికారులు రెవెన్యూ రాబడిపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. వీడియో సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, జాన్సన్, మాధురి, కళావతి, కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొనగా, క్షేత్ర స్థాయి నుంచి రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత శాఖల క్షేత్ర స్థాయి అధికారులు పాల్గొన్నారు.
పి.రాజాబాబు
ఎస్పీ హర్షవర్థన్ రాజు
మార్కాపురం ఇన్‌చార్జి కలెక్టర్, ఎస్పీల నియమాకం
మార్కాపురం ఇన్‌చార్జి కలెక్టర్, ఎస్పీల నియమాకం


