వెంకటేశ్వర్లు సేవలు ఆదర్శం
పొన్నలూరు: రైతు కుటుంబంలో జన్మించి రాజకీయ నాయకుడిగా, దాతగా ముళ్లమూరి వెంకటేశ్వర్లు సేవలు ఆదర్శమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. మండలంలోని వెంకుపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు ముళ్లమూరి వెంకటేశ్వర్లు ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ ముళ్లమూరి వెంకటేశ్వర్లు ఎంపీటీసీ, సర్పంచ్‌గా అనేక రాజకీయ పదవులు చేపట్టి గ్రామ, మండల అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందించారన్నారు. అలాగే వైఎస్సార్‌సీపీ స్థాపించింది మొదలు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ వెంకటేశ్వర్లు నిస్వార్ధ హృదయంతో అనేక గ్రామాల్లోని పేద ప్రజలకు ఆర్థికంగా సహాయపడటంతో పాటు కొండపి నియోజకవర్గంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించారన్నారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో వేల సంఖ్యలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందించి మంచి దాతగా పేరు పొందారన్నారు. వైఎస్సార్ సీపీ తరపున సంతాప సభను నిర్వహించి ఘన నివాళి అర్పించామని, భవిష్యత్‌లో ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మనందరెడ్డి, కొండపి నియోజకవర్గ పరిశీలకుడు వై వెంకటేశ్వరరావు, పార్టీ సీఈసీ సభ్యుడు డాక్టర్ మాదాసి వెంకయ్య, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, ఆర్టీఐ విభాగం రాష్ట్ర కార్యదర్శి పిల్లి తిరుపతిరెడ్డి, జిల్లా కార్యచరణ కార్యదర్శి కాటా మాధవరావు, కొండపి, మర్రిపూడి, జరుగుమల్లి మండలాల కన్వీనర్లు బచ్చుల కోటేశ్వరరావు, ఇంకొల్లు సుబ్బారెడ్డి, పిన్నిక శ్రీనివాసరావు, గడ్డం మాల్యాద్రి, కాటా మల్లికార్జున, యర్రా రామకృష్ణ, కూరపాటి లక్ష్మినారాయణ, ముప్పా కోటేశ్వరరావు, జ్యేష్ఠ వేణు, యంప్రాల మాధవ, అనుమోలు ప్రసాద్, కనపర్తి గోవిందమ్మ, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌కే మస్తాన్‌వలి, మన్నెం రవణయ్య పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: నూతన సంవత్సర వేడకల సందర్భంగా అనుమతులు లేకుండా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్థన్ రాజు హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో కేక్ కట్ చేయడం, డీజేలు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం, రోడ్డు కూడళ్లలో గుంపులుగా గుమిగూడడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు పేల్చడం, ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలు, ఇతర సున్నితప్రాంతాల దగ్గర లౌడ్ స్పీకర్లు, డీజేలు పెట్టవద్దని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసేసి అధిక శబ్దాలతో ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, బైక్, కార్ రేసింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం మత్తులో డ్రైవ్ చేసినా, ప్రజా రవాణాకు అడ్డంకులు సృష్టించినా ఉపేక్షించేది లేదన్నారు. మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, దాబాలను నిర్దేశించిన సమయంలో మూసివేయాలని చెప్పారు. నగరంలో రాత్రి 10 గంటల తరువాత కర్నూలు రోడ్డు బైపాస్ ఫ్‌లైఓవర్‌ను మూసివేయనున్నట్లు తెలిపారు. ఒంగోలు నగరంతో పాటుగా జిల్లాలోని ముఖ్య పట్టణాలు, ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించనున్నట్లు తెలిపారు. ఒంగోలు నగరంలోని కొప్పోలు రోడ్డు, మంగమూరు రోడ్డు, పేర్నమిట్ట రోడ్డుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డ్రోన్ కెమెరాల పర్యవేక్షణతో పాటుగా పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు.
జిల్లా వ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు...
జిల్లాలోని అన్నీ సబ్ డివిజన్ల పరిధిలో బుధవారం సాయంత్రం నుంచి ముఖ్య కూడళ్లలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 136 పోలీసు పికెట్లు, 56 మొబైల్ పార్టీలు, 30 డ్రంక్ అండ్ డ్రైవ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ టీంలు, నైట్ గస్తీ బృందాలను ఏర్పాటు చేయనున్నుట్లు వివరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, నూతన సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి
శివప్రసాద్‌రెడ్డి
వెంకుపాలెంలో ముళ్లమూరి వెంకటేశ్వర్లు విగ్రహం ఆవిష్కరణ
ఎస్పీ హర్షవర్థన్ రాజు హెచ్చరిక


