
అడ్డగోలుగా పర్మిట్ రూమ్‌లు
● ప్రభుత్వ ఆదాయానికి
గండికొడుతున్న వైనం
● వాటాలు ముడుతుండటంతో
ఎకై ్సజ్ శాఖ గప్‌చుప్
పొదిలి: జిల్లాలో మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్‌లను అనుమతి లేకుండా నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. పర్మిట్ రూమ్ ఏర్పాటు చేసుకునేందుకు రూ.7.50 లక్షలు, రూ.5 లక్షలు రెండు స్థాయిల్లో రుసుం చెల్లించాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం ఇటీవలే జీఓ జారీ చేసింది. అయితే అంతకంటే ముందు నుంచే పర్మిట్ రూమ్‌లు నిర్వహిస్తున్న కొందరు దుకాణదారులు.. తాజా జీవో తర్వాత ప్రభుత్వానికి పైసా కూడా చెల్లించలేదని సమాచారం. పొదిలి మండలంలో ఆరు దుకాణాలు ఉండగా ఒక లైసెన్స్‌దారుడు మాత్రమే రూ.7.50 లక్షలు చెల్లించారు. కానీ అన్ని దుకాణాల వద్ద పరి్‌మ్‌ట్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. స్థానిక ఎకై ్సజ్ సీఐ మాత్రం పొదిలిలో ఎక్కడా పర్మిట్ రూమ్‌లు లేవని చెప్పడం గమనార్హం.