
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ (94) కన్నుమూశారు.

కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం (30-08-2025) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

నానమ్మ పార్థివదేహాన్ని చూసి అల్లు అర్జున్ భావోద్వేగానికి లోనయ్యాడు.

చిరంజీవి కుటుంబం, నాగచైతన్య, వెంకటేశ్ సహా పలువురు సినీ ప్రముఖులు కనకరత్నమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.














