breaking news
Kanakaratnamma
-
ఏపీలో కల్తీ పాల కలకలం.. ఇద్దరు మృతి
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర శివారు లాలాచెరువు పరిధిలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్లో కల్తీపాలు తాగి పలువురు అస్వస్థతకు గురైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. చౌడేశ్వరినగర్‌కు చెందిన తాడి కృష్ణవేణి (85), కనకరత్నం (70) మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 8 మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో వృద్ధులు, చిన్నారులున్నారు. ఒక్కసారిగా మూత్రం బంద్ కావడం, వాంతులు కావడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో మూడేళ్ల చిన్నారికి డయాలసిస్ చేస్తున్నారు. మరో ఇద్దరు ప్రైవేటు ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు, కొంతమంది చిన్నారులకు డయేరియా, కిడ్నీ ఫెయిలైన సమస్యలు తలెత్తినట్టు వైద్యాధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలు నిర్వహించారు. వారికి సరఫరా అవుతున్న పాల వల్లే ఈ సమస్య తలెత్తిందని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలకు పాలు పోస్తున్న కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గణేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎవరు సరఫరా చేస్తున్నారు.. ఎన్ని ఇళ్లకు పాలు అందజేస్తున్నారు.. ఎవరి ఆధ్వర్యంలో సరఫరా జరుగుతోంది.. ఏయే గ్రామాల నుంచి రాజమహేంద్రవరానికి పాలు వస్తున్నాయనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గణేష్ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో 150కి పైగా ఇళ్లలో పాలు పోస్తున్నట్టు తెలిసింది. ప్రజలు అస్వస్థతకు గురైన కాలనీల్లో వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేసున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని,అక్కడ పరిస్థితులను లోతుగా పరిశీలిస్తున్నామని చెప్పారు. మూత్రం నిలిచి.. వాంతులతో ప్రారంభమై..రాజమహేంద్రవరంలో అనూరియా (మూత్రం ఆగిపోవడం) కేసులు రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన నలుగురు వ్యక్తులు అనూరియా లక్షణాలతో స్థానిక కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. వెంటనే ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ జిల్లా సర్వైలెన్స్ అధికారికి సమాచారం అందించడంతో అత్యవసరంగా విచారణ ప్రారంభించారు. కిమ్స్ ఆస్పత్రిని డీఎంహెచ్‌వో, జిల్లా సర్వైలెన్స్ అధికారి, జిల్లా ఎపిడమాలజిస్ట్తో పాటు ఎపిడమిక్ సెల్ బృందం బాధితులను పరిశీలించింది. వైద్యుల ప్రాథమిక నివేదికలు, కుటుంబ సభ్యుల వివరాలు, కేసు హిస్టరీ ఆధారంగా ఆకస్మికంగా మూత్రపిండాలు వైఫల్యం చెందినట్టు అనుమానం వ్యక్తమవుతోందని అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి విచారణలో బాధితులందరూ ఒకే పాల విక్రేత నుంచి పాలు కొనుగోలు చేసి వినియోగించినట్టు గుర్తించామన్నారు. ఇటువంటి మరో నలుగురు బాధితులను ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొంతమందిని కాకినాడ ఆస్పత్రికి కూడా తరలించారు. బాధితులందరూ 60 సంవత్సరాలు పైబడిన వారు కాగా.. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లోని నాలుగు కుటుంబాలకు చెందిన వారుగా గుర్తించారు. అధికారులు స్థానికంగా పాలు, నీళ్ల నమూనాలు సేకరించారు. దీనిపై నివేదిక వచ్చిన తరువాత ఏం జరిగిందనే విషయమై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.ల్యాబ్‌కు నమూనాలుకల్తీ పాలతో ఇద్దరు మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురవడంతో అధికారులను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అప్రమత్తం చేశారు. ఆహారం, నీరు, మల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు, ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. అనుమానిత పాల వనరును ఫుడ్ సేఫ్టీ అధికారి పరిశీలించి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది.5 రోజుల్లో 12 మంది బాధితులు?చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, రెవెన్యూ కాలనీ పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి గడచిన 5 రోజుల్లో సుమారు 12 మంది ఆస్పత్రుల పాలైనట్టు తెలిసింది. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనధికారిక సమాచారం. లాలాచెరువు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, చౌడేశ్వరి నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు. -
అల్లు కనకరత్నమ్మ మృతికి ప్రధాని సంతాపం
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ(94) మృతి చెందిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గత శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కనకరత్నమ్మ మృతి పట్ల ధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అల్లు కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. కనకరత్నమ్మ తన కళ్లను దానం చేయడం గొప్ప విషయం అని.. ఒక జీవితానికి వెలుగునిచ్చి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ కష్ట సమయంలో అల్లు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ మోదీ ఓ సందేశాన్ని పంపారు. ప్రధానమంత్రి తెలిపిస సంతాప సందేశానికి అల్లు అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు.అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని కోకాపేటలోని అల్లు కుటుంబ ఫామ్‌హౌస్‌లో జరిగాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, వెంకటేష్, నాగ చైతన్య, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. -
‘థాంక్యూ జగన్ గారు’.. అల్లు అర్జున్ ట్వీట్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నాన్నమ్మ కనకరత్నమ్మ(94) మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కనకరత్నమ్మ మృతి విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు.(చదవండి: పాడె మోసిన అల్లు అర్జున్, చిరంజీవి, రామ్‌చరణ్..)‘దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ గారు మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.వైఎస్ జగన్ సంతాప ప్రకటనపై అల్లు అర్జున్(Allu Arjun ) స్పందించాడు. ‘సంతాపం ప్రకటించినందుకు థ్యాంక్యూ జగన్ గారు. మీ మంచి మాటలు, మద్దతుకు మేము నిజంగా కృతజ్ఞులం’ అని బన్నీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం బన్నీ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. -
అల్లు కనకరత్నం అంత్యక్రియల్లో పాల్గొన్న మెగా ఫ్యామిలీ (ఫోటోలు)
-
అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
-
తెల్లవారుజామున కన్నుమూసిన అల్లు కనకరత్నం (94)
-
అల్లు అరవింద్ తల్లి పార్థివదేహానికి సెలబ్రిటీల నివాళులు (ఫోటోలు)
-
అమ్మమ్మని చివరి చూపు చూడటానికి వచ్చిన రామ్ చరణ్
-
అల్లు కనకరత్నం పార్థివదేహానికి నివాళులు అర్పించిన టాలీవుడ్ ప్రముఖులు
-
అల్లు అరవింద్ తల్లి మృతి.. వైఎస్ జగన్ సంతాపం
దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ‘దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ గారు మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.కాగా, గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న బాధపడుతున్న కనకరత్నమ్మ (94) శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఈ రోజు మధ్యాహ్నం కోకాపేటలో కనకరత్నమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య గారి సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి తల్లి కనకరత్నమ్మ గారు మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) August 30, 2025


