
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ(94) మృతి చెందిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గత శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కనకరత్నమ్మ మృతి పట్ల ధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అల్లు కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
కనకరత్నమ్మ తన కళ్లను దానం చేయడం గొప్ప విషయం అని.. ఒక జీవితానికి వెలుగునిచ్చి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ కష్ట సమయంలో అల్లు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ మోదీ ఓ సందేశాన్ని పంపారు. ప్రధానమంత్రి తెలిపిస సంతాప సందేశానికి అల్లు అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు.
అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని కోకాపేటలోని అల్లు కుటుంబ ఫామ్‌హౌస్‌లో జరిగాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, వెంకటేష్, నాగ చైతన్య, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు.