
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నాన్నమ్మ కనకరత్నమ్మ(94) మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కనకరత్నమ్మ మృతి విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు.
(చదవండి: పాడె మోసిన అల్లు అర్జున్, చిరంజీవి, రామ్‌చరణ్..)
‘దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ గారు మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
వైఎస్ జగన్ సంతాప ప్రకటనపై అల్లు అర్జున్(Allu Arjun ) స్పందించాడు. ‘సంతాపం ప్రకటించినందుకు థ్యాంక్యూ జగన్ గారు. మీ మంచి మాటలు, మద్దతుకు మేము నిజంగా కృతజ్ఞులం’ అని బన్నీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం బన్నీ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
