
రాష్ట్రస్థాయి యోగాసనాల్లో సత్తా
పీసీపల్లి: రాష్ట్రస్థాయి యోగాసనాల్లో మండలంలోని వెంగలాయపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన స్వర్ణ వెంకటరమణయ్య సత్తా చాటారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో హ్యాండ్ బ్యాలెన్స్ ఆసనాల్లో ద్వితీయస్థానం, సుపైన్ ఆసనాల్లో తృతీయ స్థానం సాధించి జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యారు. వెంకట రమణయ్యను మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు, సంజీవ్ ఆంధ్రప్రదేశ్ పతంజలి యోగ పీఠం అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు అభినందించారు.

రాష్ట్రస్థాయి యోగాసనాల్లో సత్తా