
హెచ్‌ఎంల సంఘ జిల్లా కార్యవర్గం ఎన్నిక
ఒంగోలు సిటీ: ఏపీ హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ ఎన్నిక ఆదివారం ఒంగోలులోని ప్రధానోపాధ్యాయుల భవనంలో నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డేనియల్ పరిశీలకునిగా వ్యవహరించారు. జిల్లా గౌరవ అధ్యక్షునిగా ఎస్‌కే అహ్మద్ (జెడ్పీహెచ్‌ఎస్, ఏనుగులదిన్నెపాడు), అధ్యక్షునిగా ఎం.సుధాకర్ (జెడ్పీహెచ్‌ఎస్, తర్లుపాడు), ప్రధాన కార్యదర్శిగా వై.వెంకటరావు (జెడ్పీహెచ్‌ఎస్, త్రోవగుంట), కోశాధికారిగా జీఎస్‌ఆర్ సాయి (జెడ్పీహెచ్‌ఎస్, పల్లామల్లి), రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎం.శ్రీనివాసరావు (జెడ్పీహెచ్‌ఎస్, బిట్రగుంట), ఎస్‌కే ఖాదర్‌మస్తాన్ (జెడ్పీహెచ్‌ఎస్ గరల్స్, దర్శి), ఎం.విజయభాస్కర్‌రెడ్డి (జెడ్పీహెచ్‌ఎస్, అర్థవీడు), కార్యనిర్వాహక కార్యదర్శిగా పీ.మహబూబ్ ఖాన్ (జెడ్పీహెచ్‌ఎస్, పెద్దకండ్లగుంట), కేంద్ర కార్యదర్శిగా పీ.సుధాకర్ (జెడ్పీహెచ్‌ఎస్, జరుగుమల్లి)లను ఎన్నుకున్నారు. మార్కాపురం డివిజన్ అధ్యక్షునిగా టీ శ్రీనివాసులరెడ్డి (జెడ్పీహెచ్‌ఎస్, తాటిచర్లమోటు), కార్యదర్శిగా ఎస్.నాగేశ్వరరావు (జెడ్పీహెచ్‌ఎస్,మర్రిపాలెం), ఒంగోలు డివిజన్ అధ్యక్షునిగా కేసీహెచ్ సుబ్బారావు, కార్యదర్శిగా ఎస్‌వీ రాంబాబులను ఎన్నుకున్నారు.
ఎం.సుధాకర్
వై.వెంకటరావు

హెచ్‌ఎంల సంఘ జిల్లా కార్యవర్గం ఎన్నిక