
ప్రకాశం పంతులు జీవితం ఆదర్శనీయం
ఒంగోలు సిటీ: స్వాతంత్య్ర సమరయోధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం భావితరాలకు ఆదర్శనీయమని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. ప్రకాశం పంతులు జయంతి వేడుకలను స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ వై.ఎం.ప్రసాద్‌రెడ్డి, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షురాలు పేరం ప్రసన్న, వైఎస్సార్‌సీపీ నాయకులు రాజీవ్, నాగరాజు, అమర్, పులుసు సురేష్, పీటర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.