జగన్‌ రాజీనామా చేయరు.. చేయాల్సిన పనిలేదు: వైవీ సుబ్బారెడ్డి | YV Subba Reddy Comments On Chandrababu's Government | Sakshi
Sakshi News home page

జగన్‌ రాజీనామా చేయరు.. చేయాల్సిన పనిలేదు: వైవీ సుబ్బారెడ్డి

Jul 10 2024 11:06 AM | Updated on Jul 10 2024 12:45 PM

YV Subba Reddy Comments On Chandrababu's Government

రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి తేల్చిచెప్పారు.

సాక్షి, ప్రకాశం జిల్లా: రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి తేల్చిచెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టాలని డిమాండ్‌ చేశారు.

ఇసుక పాలసీపై కావాలంటే విచారణ చేసుకోవచ్చు.. కాని గత ప్రభుత్వంపై నిందలు వేయడం సమంజసం కాదని వైవీ అన్నారు. వైఎస్‌ జగన్‌ రాజీనామా చేస్తారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. జగన్‌ రాజీనామా చేయరు.. చేయాల్సిన పనిలేదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement