YSRTP Chief YS Sharmila Serious Comments on TRS Government - Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ అంటే.. తాలిబన్ల రాష్ట్ర సమతి: వైఎస్‌ షర్మిల ఫైర్‌

Dec 4 2022 4:22 PM | Updated on Dec 4 2022 5:03 PM

YSRTP YS Sharmila Serious Comments On TRS Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టీఆర్‌ఎస్‌ గుండాలతో ప్రాణహాని ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాగా, ఆదివారం వైఎస్‌ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. మహిళ పాదయాత్ర చేస్తే పోలీసు స్టేషన్‌లో కూర్చోబెడతారా?. ఎమ్మెల్యేల అవినీతిని హైలైట్‌ చేస్తే జీర్ణించుకోలేక దాడులు చేస్తారా. ప్రజాఫోరం ఏర్పాటు చేసి మీ నిజాయితీ నిరూపించుకోవాలి. టీఆర్‌ఎస్‌ గూండాల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నా బస్సును వాళ్లే తగలబెట్టి నన్ను సారీ చెప్పమంటారా!. మీది తాలిబన్ల భాష, తాలిబన్ల రాష్ట్ర సమితి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement