ఆళ్లగడ్డలో సామాజిక సాధికార యాత్ర: ‘జగన్‌ పాలనలోనే అన్ని వర్గాలు బాగుపడ్డాయి’

YSRCP Samajika Sadhikara Bus Yatra In Nandyal Allagadda Press Meet - Sakshi

సాక్షి, నంద్యాల: వైఎస్సార్‌సీపీని ఆదరించేందుకు ఏపీ ప్రజలు మరోసారి సిద్ధం అవుతున్నారని, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే అన్నివర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని డిప్యూటీ సీఎం అంజాద్ భాషా అంటున్నారు. ఆళ్లగడ్డలో ఇవాళ వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌సీపీ నేతలు యాత్రకు ముందు మీడియా సమావేశంలో మాట్లాడారు. 

గత ప్రభుత్వంలో చంద్రబాబు అన్ని సామాజిక వర్గాలను మోసం చేయడమే కాకుండా.. అబద్ధపు వాగ్దానాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం అభివృద్ధి చెందడం మాత్రమే కాదు.. అన్ని సామాజిక వర్గాలు బాగుపడ్డాయి. ఇలా అన్నిరకాలుగా రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అంతేకాదు.. దేశంలో ఎక్కడా లేనివిధంగా 50 శాతం రిజర్వేషన్లతో అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నారని ఆంజాద్‌ బాషా గుర్తు చేశారు. 

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం కాబట్టే ప్రజల్లోకి సామాజిక సాధికార యాత్ర ద్వారా ధైర్యంగా వెళ్లగల్గుతున్నామని, కానీ, చంద్రబాబు మాత్రం ఎన్నికల సమయంలో మరోసారి ప్రజల్ని మభ్యపెట్టేందుకు మాయమాటలు చెబుతున్నారని, ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అంజాద్ భాషా సూచించారు.

మంత్రి నారాయణ స్వామి కామెంట్లు..
‘‘ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మైనార్టీలు నా వాళ్లే అంటూ చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెబుతారు. తన ప్రభుత్వంలో బీసీలను ఏనాడు పట్టించుకోని చంద్రబాబు.. ఇప్పుడు మాయమాటలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పవన్ కల్యాణ్ కాపుల ఓట్ల కోసం చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకు ప్రాకులాడుతున్నారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని చంద్రబాబు మాట్లాడం పై చంద్రబాబుకు ఎస్సీలపై ఎంత ప్రేమ ఉందో  అర్థం అయ్యింది. బీసీలను ,ఎస్సీలను నాడు చంద్రబాబు అవమానిస్తూ మాట్లాడిన మాటలెవరూ మర్చిపోరు. చంద్రబాబు వెన్నుపోటు చరిత్ర రాష్ట్రం దేశం అంతా తెలుసు అని చంద్రబాబు ఎన్ని కుయుక్తులు చేసిన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. రాష్ట్ర ప్రజలందరికీ నవరత్నాల పథకాలతో మంచి చేస్తుంటే చంద్రబాబు,  ప్రతిపక్ష పార్టీలు కడుపు మంటతో ఉన్నాయి’’.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top