YSRCP MP Vijayasai Reddy Comments On Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ: ఎంపీ విజయసాయిరెడ్డి

Aug 17 2023 6:39 PM | Updated on Aug 17 2023 8:16 PM

Ysrcp Mp Vijayasai Reddy Comments On Chandrababu - Sakshi

క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌సీపీకి పూర్తి బలం ఉందని, గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

సాక్షి, బాపట్ల: క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌సీపీకి పూర్తి బలం ఉందని, గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 51 శాతానికి పైగా ప్రజలందరూ వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారు. 151 సీట్లకు ఒక్క సీటు కూడా తగ్గదు. సీఎం జగన్‌ సంక్షేమ పాలననే ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారు’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

‘‘చంద్రబాబు ప్రతీ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. టీడీపీ కూటమికి గుణపాఠం నేర్పిస్తాం. చంద్రబాబు తనను తాను సింహంలా ఊహించుకుంటున్నాడు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే. టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ. అధికారం కోసం టీడీపీ నేతలు దేశ ద్రోహానికి కూడా వెనకాడరు. దేశ వ్యతిరేక శక్తులతో కూడా పొత్తు పెట్టుకుంటారు. ఏపీలో చంద్రబాబుకు ఒక స్థిర నివాసం లేదు’’ అంటూ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.

‘‘సంక్షేమ పథకాల అమలులో సీఎం జగన్‌ సామాజిక న్యాయం చేశారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుని గొప్ప విజన్‌ అంటూ చంద్రబాబు హడావుడి చేస్తాడు. విజన్‌ 2047 అంటూ కొత్త రాగం అందుకున్నాడు. ప్రజలను నమ్మించి మోసం చేసేందుకే చంద్రబాబు విజన్‌ మాట. 2024 తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగుస్తుంది’’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
చదవండి: చంద్రబాబు కొత్త డ్రామా.. సానుభూతి కోసం ఇంతకు దిగజారాలా? 

అసాంఘిక వ్యక్తులకు సపోర్ట్‌ చేసే టీడీపీ అసలు రాజకీయ పార్టీనే కాదని.. టీడీపీ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ ఘన విజయం సర్వేల ద్వారా తేలిపోయింది. 2024 తర్వాత టీడీపీ అంతర్థానమైపోతుంది. లోకేష్‌కు ఎటువంటి రాజకీయ భవిష్యత్తు లేదని విజయసాయిరెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement