ప్రజల భద్రత కాదు.. పోలీసుల ప్రాధాన్యతలు మారిపోయాయి: విజయసాయిరెడ్డి | YSRCP MP Vijaya Sai Reddy Key Comments Over AP Police | Sakshi
Sakshi News home page

ప్రజల భద్రత కాదు.. పోలీసుల ప్రాధాన్యతలు మారిపోయాయి: విజయసాయిరెడ్డి

Nov 14 2024 1:13 PM | Updated on Nov 14 2024 1:13 PM

YSRCP MP Vijaya Sai Reddy Key Comments Over AP Police

సాక్షి, తాడేపల్లి: ఏపీ పోలీసులు తమ వనరులను టీడీపీ రాజకీయ ఎజెండాకు మళ్లిస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భద్రతను పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘రాష్ట్రంలో పోలీసుల ప్రాధాన్యతలు మారిపోయాయి. మహిళలపై అఘాయిత్యాలు, సైబర్ నేరాలు పెరుగుతున్నా వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏపీ పోలీసులు తమ  వనరులను టీడీపీ రాజకీయ ఎజెండాకు మళ్లిస్తున్నారు. 680 మంది వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు అందించారు. 147 కేసులు నమోదు చేసి, 49 మందిని  అరెస్టు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భద్రతను పక్కన పెట్టారు’ అని ఘాటు విమర్శలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement