రేపు ఏపీ స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు | Sakshi
Sakshi News home page

రేపు ఏపీ స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు

Published Sun, Jan 28 2024 5:59 PM

YSRCP And TDP Rebel MLAs May Appear Speaker Tomorrow - Sakshi

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ముందు సోమవారం హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది. రేపు(సోమవారం) ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకానున్నారు. అయితే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ ముందుకు వైస్సార్‌సీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరై, వివరణ ఇవ్వనున్నారు. 

ఇక.. వైఎస్సార్‌సీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు విచారణకు రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు చేసిన విషయం తెలిసిందే. అనర్హత పిటిషన్లపై విచారణకు 29వ తేదీన స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించింది. వైఎస్సార్‌సీపీ రెబల్‌ ఎమ్మెల్యేల్లో ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు.

చదవండి:  గంటా రాజీనామా ఆమోదం.. టీడీపీలో కొత్త టెన్షన్‌!

Advertisement
 

తప్పక చదవండి

Advertisement