కుప్పంలో టీడీపీ దౌర్జన్యకాండ: వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం

YSR Idol Vandalise In Kothuru Kuppam Constituency - Sakshi

సాక్షి, చిత్తూరు: తెలుగుదేశం పార్టీ నాయకులు మరోసారి రెచ్చిపోయారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ నాయకులు దౌర్జన్యకాండ చేశారు. గుడిపల్లి మండలంలోని కొత్తూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గురువారం అర్ధరాత్రి వేళ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వైఎస్సార్‌ విగ్రహ ధ్వంసంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన
చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top