
సాక్షి,చెన్నై: కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధిత కుటుంబాల్ని పరామర్శించేందుకు నటుడు,తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ సిద్ధమయ్యారు. అయితే ఒక్కో బాధిత కుటుంబానికి వెళ్లి పరామర్శించేందుకు విజయ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.
కరూర్ తొక్కిసలాట ఘటన సెప్టెంబర్ 27న టీవీకే ప్రచార సభలో జరిగింది. ఈ ఘటనలో 41 మంది మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు. ఈ క్రమంలో విజయ్ ఒక్కో బాధిత కుటుంబానికి వెళ్లి నేరుగా పరామర్శించేందుకు సిద్ధమయ్యారు. కరూర్ తొక్కిసలాటలోని బాధిత కుటుంబాల్ని వ్యక్తిగతంగా కలవాలన్న ఉద్దేశంతో తమిళనాడు డీజీపీకి ఈమెయిల్ ద్వారా అనుమతి కోరారు. అయితే పోలీసుల నుంచి అనుమతి ఇంకా రాలేదు. భద్రతా కారణాల వల్ల విజయ్ పరామర్శను ఒకే వేదికలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇంటింటికి వెళ్లి బాధితుల్ని కలవడం వల్ల గందరగోళం నెలకోవడంతో పాటు, అదుపు చేయలేని పరిస్థితులు తలెత్తుతాయని అందుకే విజయ్‌కు తమిళనాడు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు బాధితుల పరామర్శ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కల్పించాలని టీవీకే పోలీసుల నుంచి అనుమతి తీసుకుంది. తిరుచ్చి ఎయిర్‌పోర్టు నుంచి వాహనంలో విజయ్ కరూర్‌లో బాధితులందరూ ఒకే చోట సమావేశయ్యేలా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు రానున్నారు. ఆ ప్రాంతం వరకు జనం లేకుండా చూడాలని టీవీకే ప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.
టీవీకే అనుమతికి అనుగుణంగా పోలీసులు సైతం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ వచ్చే మార్గంలో చెక్‌పాయింట్‌లు,మొబైల్ పెట్రోల్ యూనిట్లు, ప్రజలు గుమిగూడకుండా ట్రాఫిక్ మళ్లింపులు, జనసమూహాన్ని నివారించడానికి విమానాశ్రయం ఎంట్రన్స్,ఎగ్జిట్ పాయింట్ల వద్ద పోలీసు ఎస్కార్ట్‌లు ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు తమిళ స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
దీంతోపాటు కరూర్‌లో జరిగే వేదికకు సంబంధించి..ఒక కిలోమీటరు వరకు పోలీసులు మోహరించనున్నారు. ముందస్తు అనుమతి పొందిన బాధిత కుటుంబ సభ్యులకు మాత్రమే వేదిక వద్దకు అనుమతి ఇవ్వనున్నారు. ఎంట్రీ,ఎగ్జిట్ పాయింట్ల వద్ద బాధితుల కుటుంబ సభ్యులన్ని ధృవీకరిస్తారు. ఆ సమయంలో జనం లేకుండా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.
This video shows how much effort @TVKVijayHQ has taken in that time for people safety , he gave priority for the people but #KarurStampede happend was unexpected pic.twitter.com/mZu6s1QPFa
— 𝕽æ𝖓𝖏𝖎𝖙𝖍𝕶ü𝖒𝖆𝖗 (@romeorkr) October 4, 2025