వారసత్వ వ్యాఖ్యలపై బీజేపీకి ఉదయనిధి కౌంటర్‌ | I Agree That DMK Is A Family Party, Udhayanidhi Stalin Counter To BJP Over Nepotism Barb- Sakshi
Sakshi News home page

వారసత్వ వ్యాఖ్యలపై బీజేపీకి ఉదయనిధి కౌంటర్‌

Published Sun, Mar 24 2024 4:59 PM | Last Updated on Sun, Mar 24 2024 6:50 PM

Udhayanidhi Stalin Counter To BJP Over Nepotism Barb - Sakshi

చెన్నై: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ బీజేపీ విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ చేసిన వారసత్వ, కుటుంబ రాజకీయలకు సంబంధించిన వ్యాఖ్యలపై ఉదయనిధి ఆదివారం స్పందిస్తూ ఎదురుదాడి చేశారు. ‘బీజేపీ వాళ్లు విమర్శంచినట్లు.. డీఎంకే పార్టీ కుటుంబ వారసత్వ పార్టీనే. నేను కూడా అంగీకరిస్తాను. అయితే తమిళనాడు ప్రజలు మొత్తం కరుణానిధి కుటుంబం’ అని మంత్రి ఉదయనిధి అన్నారు.

ఇటీవల ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ చెన్నై ర్యాలీలో పాల్గొని ఎంకే స్టాలిన్‌ డీఎంకే పార్టీ వారసత్వం కుటంబ పార్టీ అని విమర్శలు చేశారు. కుటుంబ పార్టీలు కేవలం తమ భవిష్యత్తు మాత్రమే చూసుకుంటాయని అన్నారు. కానీ, నేను దేశంలో ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం కృషి చేస్తానని మోదీ తెలిపారు. డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలకు మొదట ప్రాధాన్యం కుటుంబం.. తర్వాతే దేశం అని అన్నారు. అదే విధంగా ఇండియా కూటమి మొత్తం ఇదే విధానాన్ని పెంచి పోషిస్తోందని విమర్శలు చేశారు.

ఇక.. తమిళనాడు మొత్తం 39 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019లో డీఎంకే నేతృత్వంలోని కూటమి మొత్తం 38 స్థానాల్లో  విజయం సాధించింది. డీఎంకే సొంతంగా 23 స్థానాల్లో గెలుపొంది.. 33.2 శాతం ఓట్‌ షేర్‌ను సంపాధించుకుంది. రాబోయే లోక్‌ సభ ఎ‍న్నికల్లో మొదటి విడతలోనే ఏప్రిల్‌ 19న తమిళనాడులో పోలింగ్‌  జరగనుంది. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement