బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు | TS High Court Verdict Invalidated Election Of BRS MLC Vital | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు

May 3 2024 2:06 PM | Updated on May 3 2024 2:06 PM

TS High Court Verdict Invalidated Election Of BRS MLC Vital

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దండె విఠల్‌కు ఊహించని షాక్‌ తగిలింది. విఠల్‌ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పును వెల్లడించింది.

కాగా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా దండె విఠల్‌ ఎన్నికపై కాంగ్రెస్‌ నేత పాతిరెడ్డి రాజేశ్వర్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా విఠల్‌ ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే విఠల్‌కు రూ.50వేలు జరిమానా కూడా విధించింది.

అయితే, 2022లో ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దండె విఠల్‌ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో తాను నామినేషన్‌ విత్‌ డ్రా చేయలేదని.. తన సంతకాలు ఫోర్జరీ చేశారని రాజేశ్వర్‌ రెడ్డి ఎన్నికల అనంతరం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పిటిషన్‌లో విఠల్‌ ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాలని కోర్టును కోరారు. ఇదే సమయంలో ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్‌ లేబొరేటరికీ పంపించాలని కోరారు. అనంతరం దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. విఠల్‌ ఎన్నికను రద్దు చేస్తూ నేడు తీర్పు వెల్లడించింది. మరోవైపు.. విఠల్‌ లాయర్‌ అభ్యర్థనతో తీర్పును కోర్టు.. నాలుగు వారాలు సస్పెండ్‌ చేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement