కేసీఆర్‌ను గద్దె దించేందుకు అందరూ సిద్ధం: పొంగులేటి | Telangana People Ready To Out CM KCR Sys Ponguleti Srinivasa Reddy | Sakshi
Sakshi News home page

ఏ పార్టీలో చేరేది వచ్చే నేలలో చెబుతా.. కేసీఆర్‌ను గద్దె దించేందుకు అందరూ సిద్ధం: పొంగులేటి

Apr 17 2023 7:43 AM | Updated on Apr 17 2023 2:46 PM

Telangana People Ready To Out CM KCR Sys Ponguleti Srinivasa Reddy - Sakshi

సాక్షి, ఖమ్మం/ఎన్టీఆర్‌: తెలంగాణలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును గద్దె దించి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో శ్రీతిరుపతమ్మవారిని ఆదివారం ఆయన దర్శించుకున్నారు.

అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కేసీఆర్‌ను గద్దె దించేందుకు ఏ పార్టీ ముందడుగు వేస్తుందో ఆ పారీ్టకే ప్రజల మద్దతు ఉంటుందని, ఆ పార్టీ వైపే తన పయనమని స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయం మేరకు తాను ఏ పార్టీలో చేరాలనే అంశంపై మే నెలలో ప్రణాళిక నిర్ణయిస్తామని తెలిపారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలేవీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. పొంగులేటి పర్యటనలో మధిర నాయకులు కోట రాంబాబు, ముదిగొండ మాజీ ఏఎంసీ చైర్మన్‌ బత్తుల వెంకటరావు, బోనకల్లు సర్పంచ్‌ సైదా తదితరులు పాల్గొన్నారు.
చదవండి: ఖమ్మంలో 10కి 10 స్థానాలు బీఆర్‌ఎస్‌వే.. ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్‌

Advertisement
 
Advertisement
Advertisement