అప్పుల రాష్ట్రంగా మార్చారు కేసీఆర్‌పై కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ధ్వజం | Telangana: Ex MLA Kommuri Pratap Reddy Comments On KCR | Sakshi
Sakshi News home page

అప్పుల రాష్ట్రంగా మార్చారు కేసీఆర్‌పై కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ధ్వజం

Nov 13 2021 3:51 AM | Updated on Nov 13 2021 3:51 AM

Telangana: Ex MLA Kommuri Pratap Reddy Comments On KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక రాష్ట్ర ఖజానాను దివాలా తీశారని ఆరోపించారు.

కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నాలుగు నెలలకోసారి వేతనాలు చెల్లిస్తూ వారిని అర్ధాకలితో గోసపెడుతున్నారని ఓ ప్రకటనలో అవేదన వ్యక్తం చేశారు. పథకాలకు నిధులు విడుదల చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దెదించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement