టీడీపీ మూడో జాబితా విడుదల  | TDP Released Third List With MLA And Candidates Ahead Of Elections, Details Inside - Sakshi
Sakshi News home page

AP Elections 2024: టీడీపీ మూడో జాబితా విడుదల 

Published Sat, Mar 23 2024 5:39 AM

TDP third list released - Sakshi

11 ఎమ్మెల్యే, 13 ఎంపీ సీట్లకు అభ్యర్థులను వెల్లడించిన చంద్రబాబు 

సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ మరో 11 అసెంబ్లీ స్థానాలు, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ జాబితాను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శుక్రవారం విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు ఆ పార్టీ 139 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్ల యింది. పొత్తులో భాగంగా 144 స్థానాల్లో పోటీచేయాల్సి వుండగా ఇంకా ఐదు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. అలాగే, పొత్తులో 8 ఎంపీ స్థానాలు వదులుకోవడంతో 17 స్థానాలకుగానూ 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మిగిలిన 4 స్థానాలకు ఖరారు చేయాల్సి వుంది. 

మూడో జాబితా ఇలా.. ఎమ్మెల్యే అభ్యర్థులు.. 
పలాస    – గౌతు శిరీష 
పాతపట్నం    – మామిడి గోవిందరావు 
శ్రీకాకుళం    – గొండు శంకర్‌ 
ఎస్‌.కోట    – కోళ్ల లలితకుమారి 
కాకినాడ సిటీ    – వనమాడి వెంకటేశ్వరరావు 
అమలాపురం    – అయితాబత్తుల ఆనందరావు 
పెనమలూరు    – బోడె ప్రసాద్‌ 
మైలవరం    – వసంత కృష్ణప్రసాద్‌ 
నరసరావుపేట    – డాక్టర్‌ చదలవాడ అరవింద్‌బాబు 
చీరాల    – ఎం. మాలకొండయ్య యాదవ్‌ 
సర్వేపల్లి    – సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి  
టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. 
శ్రీకాకుళం    – కింజరాపు రామ్మోహన్‌ నాయుడు  
విశాఖపట్నం    – మాత్కుమిల్లి భరత్‌ 
అమలాపురం    – గంటి హరీష్‌ మాధుర్‌ 
ఏలూరు    – పుట్టా మహేష్‌ యాదవ్‌ 
విజయవాడ    – కేశినేని శివనాథ్‌ (చిన్ని) 
గుంటూరు    – పెమ్మసాని చంద్రశేఖర్‌ 
నరసరావుపేట    – లావు శ్రీకృష్ణదేవరాయలు 
బాపట్ల    – తెన్నేటి కృష్ణప్రసాద్‌ 
నెల్లూరు    – వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి 
చిత్తూరు    – దగ్గుమళ్ల ప్రసాదరావు 
కర్నూలు    – బస్తిపాటి నాగరాజు 
నంద్యాల    – బైరెడ్డి శబరి 
హిందూపురం    – బీకే పార్థసారథి 

Advertisement
Advertisement