వెదురూరు ఎంపీటీసీ స్థా నానికి నామినేషన్ వేసేందుకు నా కుటుంబ సభ్యులతో కలసి చాపాడుకు వచ్చాను. 500 మీటర్ల దూరంలోనే మమ్మల్ని అడ్డగించారు. ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేసేందుకు వచ్చానని, నేను 9 నెలల గర్భిణీని అని చెబుతున్నప్పటికీ టీడీపీ మూకలందరూ గుంపుగా వచ్చి నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కెళ్లారు. ఒక్కసారిగా టీడీపీ మూకలంతా గుంపుగా రావడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందోనని భయపడ్డాను. మహిళలనే కనీస గౌరవం టీడీపీ గూండాలకు లేకుండా పోయింది.
– ప్రశాంతి, వెదురూరు, చాపాడు మండలం.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటూ టీడీపీ మూకలు ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై ఖూనీ చేస్తున్నారు. మా అభ్యర్థులు నామినేషన్ వేయకుండా పోలీసులే అడ్డుకోవడం చాలా వింతగా ఉంది. ఇంత జరుగుతు న్నా ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది. న్యాయం చేయాల్సిన అధికారులు ఈ విధంగా ప్రవర్తించడం చాలా సిగ్గుచేటు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు.
– దాసరి సుధ, ఎమ్మెల్యే
పోలీసులకు చేత కాకపోతే..
మీరు వెళ్లకూడదు... అక్కడ ఎక్కువ మంది బయటి వ్యక్తులు ఉన్నారంటూ నామినేషన్లు వేయనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం సరికాదు. ఆదినారాయణరెడ్డి ఏదో పది మంది రౌడీలకు గుండాలను పంపిస్తే ఇక్కడ భయపడిపోయి నామినేషన్లు వేయకుండపోయే పరిస్థితిలేదు. మీకు చేతకాకపోతే మమ్మల్ని వదిలేయండి.. మా సత్తా ఏంటో చూపిస్తాం.
– రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ
నామినేషన్ పత్రాలు చించేశారు
జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఒంటిమిట్ట మండల జెడ్పీటీసీ అభ్యరి్థగా వైఎస్సార్ సీపీ తరఫున నామినేషన్ వేసేందుకు వెళ్లిన నన్ను టీడీపీ నాయకులు నామినేషన్ పత్రాలు లాక్కొని చించేశారు. ముందుగా ఏ పార్టీ అని అడిగారు.. వైఎస్సార్‌సీపీ అని చెప్పగానే ఫైల్ లాక్కొని చించేసి... ‘వెళ్లిపోండి... వెళ్లిపోండి’ అని బెదిరించారు. అక్కడున్న పోలీసులు చూస్తుండి పోయారె తప్ప వారిని అడ్డుకోలేదు. ఇదేం ప్రజాస్వామ్యం.
– బాలక్క, ఒంటిమిట్ట జెడ్పీటీసీ అభ్యర్థి


