కలెక్టర్‌ నోట... ‘అసత్యాల’ మూట!! | YSR Kadapa District Collector Sridhar Support To TDP Leaders | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ నోట... ‘అసత్యాల’ మూట!!

Oct 23 2026 9:02 AM | Updated on Oct 23 2026 9:15 AM

YSR Kadapa District Collector Sridhar Support To TDP Leaders

కడప జెడ్పీ కార్యాలయం లోపల తిష్ట వేసిన టీడీపీ శ్రేణులు

జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా గురువారం కలెక్టర్‌ శ్రీధర్‌ ఎస్పీ నచికేత్‌  విశ్వనాథ్‌తో కలిసి  కడపలోని జెడ్పీని సందర్శించారు. నామినేషన్ల స్వీకరణ తీరును, అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. జిల్లా ఎన్నికల అధికారిగా.. కలెక్టర్‌ హోదాలో  ఎన్నికలను పటిష్టంగా.. పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.  క్షేత్రస్థాయిలో వాస్తవమేంటో ఓ సారి పరిశీలిద్దాం.. 

కలెక్టర్‌: ‘‘నామినేషన్ల స్వీకరణ ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నాం’’.. 
వాస్తవం: జెడ్పీ కార్యాలయ పరిసరాలు పచ్చ గూండాలతో నిండిపోయాయి.. రాళ్ల దాడులతో భయానకంగా మారాయి. అంతెందుకు జెడ్పీ ఆఫీసులోపల వందలాదిమంది పుత్తా అనుచరులు తిష్ట వేశారు.

కలెక్టర్‌: ‘‘ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదు..’’ 
వాస్తవం: రెండు రోజులుగా పచ్చమూకల దాడులతో జెడ్పీ దద్దరిల్లుతోంది.

కలెక్టర్‌: ‘‘అభ్యర్థులు నిర్భయంగా తమ ఎన్నికల హక్కులను సద్వినియోగం చేసుకోండి’’
వాస్తవం: అభ్యర్థులను ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. హక్కును హరించేస్తున్నారు.

కలెక్టర్‌: ‘నామినేషన్ల స్వీకరణలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాం.  నిర్భయంగా నామినేషన్‌ వేయొచ్చు’
వాస్తవం: కూటమి అభ్యర్థులు మినహా నామినేషన్‌ వేయాలనుకున్న ఇతర అభ్యర్థులను ఆ పరిసరాల్లోకి రాకముందే పచ్చ రౌడీలు అడ్డుకుంటున్నారు.  కర్రలు.. రాళ్లతో దాడులకు దిగుతున్నారు. బహుశా  భద్రతా చర్యలు ఇవేనేమో!  

– కడప సెవెన్‌రోడ్స్‌

ఇదీ చదవండి: టీడీపీతో అంటకాగుతున్న కమిషనర్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement