బీజేపీ నేతలెక్కడ?.. ఇవేనా స్మార్ట్‌ సిటీలు: అఖిలేష్‌ యాదవ్‌ సెటైర్లు | SP Chief And MP Akhilesh Yadav Satirical Comments On BJP Govt In UP | Sakshi
Sakshi News home page

బీజేపీ నేతలెక్కడ?.. ఇవేనా స్మార్ట్‌ సిటీలు: అఖిలేష్‌ యాదవ్‌ సెటైర్లు

Jul 10 2024 4:56 PM | Updated on Jul 10 2024 6:10 PM

SP Chief And MP Akhilesh Yadav Satirical Comments On BJP Govt In UP

లక్నో: కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై సమాజ్‌వాద్‌ పార్టీ చీఫ్‌, ఎంపీ అఖిలేష్‌ యాదవ్‌ ఆ‍గ్రహం వ్యక్తం చేశారు. యూపీలోని పలు పట్టణాలను స్మార్ట్‌ సిటీలు చేస్తామని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకున్నారు. కానీ, అవే ప్రాంతాలు నేడు వరద నీటిలో మునిగిపోయాయని ఎద్దేవా చేశారు.

కాగా, అఖిలేష్‌ యాదవ్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. యూపీలో చిన్నపాటి వర్షాలకే దారుణ పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తోంది. బీజేపీ నేతలు పలు పట్టణాలను స్మార్ట్‌ సిటీలు చేస్తామని చెప్పారు. కానీ, అవే పట్టణాలు నేడు వర్షపు నీటితో మునిగిపోయాయి. ప్రతీచోటా వరద నీరు నిలిచిపోవడంతో వ్యర్థాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్మార్ట్‌ సిటీల సంగతి దేవుడెగురు.. ముందుగా వరద నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

 

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కూడా అధ్వాన్నంగా తయారైంది. వర్షపు నీరు రోడ్లపై ఉన్న కారణంగా గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక వాహనాలు కిందపడిపోతున్నారు. రాష్ట్రంలో వైద్యశాఖకు సంబంధించిన సదుపాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. హత్రాస్‌ ఘటన కూడా పాలనా వైఫల్యం కారణంగానే జరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. యువత ఉద్యోగాలు, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని’ కామెంట్స్‌ చేశారు. 
 

 

 

Advertisement
 
Advertisement
Advertisement