
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజుపై తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీలు సంచలన ఆరోపణలకు దిగారు. లోక్‌సభలో.. ఆయన, మరో కేంద్ర మంత్రి కలిసి తమపై దాడి చేశారని మీడియా ముందుకు వచ్చారు.
తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజులపాటు నిర్బంధంలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే మూడు బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు(బుధవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. లోక్‌సభలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు బిల్లు ప్రతులను చించి విసిరారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు.
ఆ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు కలుగు జేసుకున్నారు. ‘‘సభా కార్యకలాపాలకు అడ్డు తగలడం.. ప్రతిపక్షాలకే మంచిది కాదు. ప్రత్యేకించి కొత్తగా ఎన్నికైన ఎంపీలకు. మీరెంత రచ్చ చేస్తే.. ప్రజలు మిమ్మల్ని అంతగా తిరస్కరిస్తారు. కాబట్టి.. చర్చలో పాల్గొనండి అని కోరారాయన. అయినా విపక్ష ఎంపీలు వినలేదు.
అయితే నిరసన కొనసాగుతున్న టైంలో.. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రవ్‌నీత్ సింగ్ బిట్టూ తమపై దాడి చేశారని టీఎంసీ ఎంపీలు మిథాలీ బాగ్, శతాబ్ది రాయ్ ఆరోపించారు. ‘‘ ఆ ఇద్దరూ మమ్మల్ని తోసేశారు.. దాడి చేశారు.. ఇది సిగ్గు పడాల్సిన విషయం’’ మిథాలీ బాగ్ మీడియాతో అన్నారు. అయితే..
#WATCH | Delhi | TMC MP Mitali Bagh says, "While we were protesting against the bill, Union Ministers Ravneet Singh Bittu and Kiren Rijiju attacked me, they pushed me...This is condemnable..." pic.twitter.com/5MSkVPAGqD
— ANI (@ANI) August 20, 2025
దాడి ఆరోపణల నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం స్పందించింది. ఎవరిపై అలాంటి దాడేం జరగలేదని ఓ ప్రకటన చేసింది. మరోవైపు.. అమిత్ షా ప్రసంగిస్తున్న టైంలో బిల్లుల ప్రతులను కొందరు విపక్ష ఎంపీలు చించేసి ఆయనపై విసిరేశారు. ఆ ఎంపీలను సస్పెండ్ చేయాలంటూ బీజేపీ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పీకర్ కార్యాలయం లోక్‌సభ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.